హీరోలని చూసే టికెట్లు కొనేస్తారు.. శ్రీలీల కాంట్రవర్షల్ కామెంట్స్ వైరల్..

ప్రముఖ నటి శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాఘవేంద్ర రావు గారు దర్శకత్వం వహించిన ‘పెళ్లి సందడి’ సినిమాలో తెలుగు తెరకు పరిచయమైందీ కన్నడ బ్యూటీ. మొదటి సినిమాతోనే తను అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో పదికి పైగా సినిమాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్స్‌లో ఫుల్ బిజీగా ఉంది ఈ కన్నడ బ్యూటీ.

రవితేజ సరసన ‘ధమాకా’ సినిమాలో నటించి బ్లాక్‌బాస్టర్ హిట్‌ని అందుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటించడమే కాకుండా సీనియర్ హీరోలతో కూడా నటిస్తుంది. ఇప్పుడు వరుస సినిమా షూటింగ్స్ లో బిజీ గా ఉన్న శ్రీలీల తాజాగా హీరో హీరోయిన్ల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ఈ సందర్భంగా శ్రీలిల మాట్లాడుతూ ‘ఇప్పటికీ ప్రేక్షకులు థియేటర్లకు టికెట్లు కొనుక్కుని వస్తున్నారంటే అది కేవలం హీరోలను చూసి మాత్రమే. కేవలం హీరోలపై ఉన్న అభిమానంతోనే పెద్ద ఎత్తున థియేటర్లకి వస్తున్నారు” అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

శ్రీలీల తాను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చానని, కాబట్టి ఇండస్ట్రీలో తను నటించే సినిమాలలో మంచి పాత్ర ఇస్తే చాలు అని అన్నది. సినిమా మొత్తం తనే కనిపించాలని కోరుకోట్లేదని చెప్పింది. శ్రీలీల చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ధమాకా సినిమాని దృష్టిలో పెట్టుకొని శ్రీలీల ఎటువంటి కామెంట్స్ చేసిందని అర్ధం అవుతుంది. ధమాకా సినిమాలో శ్రీలీల పాత్ర బాగా ఆకట్టుకోవడం వల్లనే ఈ సినిమా సక్సెస్ అయిందనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై శ్రీలీల ఇన్‌డైరెక్ట్‌గా ఇలాంటి కామెంట్స్ చేసినట్లు సమాచారం.

Share post:

Latest