`ఆదిపురుష్‌` మేక‌ర్స్ న‌యా స్కెచ్‌.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్పెష‌ల్ గెస్ట్ ఎవ‌రో తెలిస్తే షాకే!?

ఆదిపురుష్‌.. మొన్న‌టి వ‌ర‌కు కంట్ర‌వ‌ర్సీల‌కు కేరాఫ్‌గా నిలిచిన ఈ చిత్రంపై ఇప్పుడు క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ట్రైల‌ర్‌, ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ త‌ర్వాత ఎక్క‌డా లేని హైప్ ఆదిపురుష్‌ కు వ‌చ్చేసింది. 2023లో మోస్ట్ అవెయిటెడ్ మూవీగా ఉన్న ఈ చిత్రం జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ రాముడిగా, కృతి స‌న‌న్ సీత‌గా న‌టించారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ రావ‌ణుడిగా చేశాడు. రామాయణ కావ్యం మొత్తం కాకుండా కేవలం సీతాపహరణం ఎపిసోడ్ ను మాత్రమే ఆదిపురుష్‌లో ప్ర‌స్తావించ‌బోతున్నారు. ఇప్ప‌టికే ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ఊపందుకున్నాయి.

సౌత్ తో పాటు నార్త్ లోనూ ఆదిపురుష్ ను పెద్ద ఎత్తున ప్ర‌మోట్ చేస్తున్నారు. ఆల్రెడీ జూన్ 6న తేదీన తిరుప‌తిలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హించ‌బోతున్నారు. అలాగే హిందీలో సినిమాను జ‌న్నాల్లోకి తీసుకెళ్ల‌డం కోసం ముంబైలోనూ ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్ప‌టు చేయ‌బోతున్నారు. ఈ ఈవెంట్ కు స్పెష‌ల్ గెస్ట్ ఎవ‌రో తెలిస్తే షాకైపోతారు. ఆదిపురుష్‌పై భారీ హైప్ పెంచ‌డానికి మేక‌ర్స్ న‌యా స్కెచ్ తో భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించార‌ట‌. వీలు చిక్కితే త‌ప్ప‌కుండా వ‌స్తాన‌ని మోడీ మాట ఇచ్చార‌ట‌. ఒక‌వేళ నిజంగా ఈ ఈవెంట్ కు మోడీ వ‌స్తే.. ఆదిపురుష్ పై అంచ‌నాలు తారా స్థాయికి చేరుకోవ‌డం ఖాయ‌మ‌వుతుంది.