ధనుష్ తమ్ముడిగా తెరపై మంటలు పుట్టించనున్న తెలుగు హీరో.. ఎవరంటే..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధనుష్ కి కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కన్నడ లో ధనుష్ నటించిన సినిమాలు తెలుగులో డబ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచాయి. ఇదిలా ఉండగా ఈ మధ్య ధనుష్ ‘సార్’ అనే తెలుగు సినిమాలో నటించాడు. ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది.

ఇటీవల కాలంలో ధనుష్ సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ధనుష్ తన నెక్స్ట్ సినిమా షూటింగ్‌లో బిజీ అయిపోయాడు. అయితే ధనుష్ నటించబోయే తన నెక్స్ట్ 50వ సినిమాకి స్వయంగా ధనుష్ దర్శకత్వం వహించబోతున్నారు. ఆ సినిమాకి ఇప్పటివరకు D50 అనే పేరు పెట్టారు. D50 అనే సినిమాలో విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ధనుష్ కి తమ్ముడు పాత్రలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ని ఎంపిక చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం.

ఇక D50 అనే సినిమాలో ఎస్‌జే సూర్య కీలకపాత్రలో నటించబోతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటికే ధనుష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘ కెప్టెన్ మిల్లర్’ సినిమాలో సందీప్ కిషన్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తెలుగులో గ్యాంగ్ స్టార్ అనే పేరుతో తెలుగు ఎక్కుతున్న ఈ సినిమాలో కాళిదాస్, దుషార విజయ్ కీలకపాత్రలో కనిపించనున్నారు.

Share post:

Latest