శ్రీలీలకు అంత సీన్ ఉందా..? మరీ టూ మచ్ గా లేదు..!!

టాలీవుడ్ యంగ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న శ్రీలీల ఓవర్ చేస్తుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో శ్రీ లీల ఎంత హంగామ సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఇండస్ట్రీలో చేసింది రెండంటే రెండు సినిమాలు . మొదటి సినిమా యావరేజ్ గా మారగా రెండో సినిమా ఏకంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరే దిశగా దూసుకుపోయి శ్రీలీల పేరుని మారుమ్రోగి పోయేలా చేసింది . ఈ క్రమంలోనే శ్రీలీలకు కూడా రెమ్యూనరేషన్ విషయంలో అస్సలు తగ్గేదెలా అంటూ దూసుకుపోతుంది .

మరీ ముఖ్యంగా డబ్బు విషయంలో పక్కాగా నిక్కాసిగా కండిషన్స్ పెట్టేస్తున్న శ్రీ లీల.. తాజాగా బాలయ్య సినిమా షూట్లో చేసిన బిహేవియర్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతుంది . మనకు తెలిసిందే బాలయ్యతో సినిమా షూట్ అంటే టైం టు టైం రావాల్సిందే . పక్కాగా ఉండాల్సిందే. కేవలం బాలయ్య కాదు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఓ పంచువాలిటీ మెయింటైన్ చేస్తేనే స్టార్ హీరోయిన్గా మారగలరు . అయితే శ్రీ లీల మాత్రం ఎన్బికె 108 సినిమా షూట్ కి చాలా లేటుగా వచ్చిందట . అంతేకాదు బాగా చిలౌట్ అవుతూ లేటుగా రావడమే కాకుండా షాట్ రెడీ అయిన కూడా డైరెక్టర్ తో ప్రొడ్యూసర్ తో హెడ్ వెయిట్ బిహేవియర్ ప్రదర్శించిందట.

ఈ క్రమంలోనే కోపం వచ్చినా సరే అనిల్ రావిపూడి ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకున్నారట . అయితే నందమూరి బాలయ్య లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాడట. ” ఇండస్ట్రీలో పెద్ద పెద్ద రెమ్యూనరేషన్ తీసుకుంటే పెద్ద హీరోయిన్లు అయిపోరు.. మంచితనం..పెద్దలకి రెస్పెక్ట్ ఇస్తేనే పెద్ద హీరోయిన్గా మారుతారు” అంటూ చెప్పుకొచ్చారట . ఈ క్రమంలోనే బాలయ్య కోపానికి బలైపోయింది శ్రీలీల. అంతేకాదు కన్నడ ఇండస్ట్రీలోను శ్రీలీల ఇలాగే బిహేవ్ చేసిందన్న కామెంట్లు కూడా వినిపించాయి . ఏది ఏమైనా డబ్బు విషయంలో ఉండే కాన్సన్ట్రేషన్ టైం విషయంలో శ్రీలీలకి లేకపోవడం బాధాకరమైన విషయమే..!!