శాకుంతలం సినిమా అట్టర్ ఫ్లాప్.. సమంత ఏం చేసిందో తెలిస్తే షాక్ అయిపోతారు..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ గా నటించిన సినిమా శాకుంతల. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిన్న బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయ్యి నెగిటివ్ టాక్ ను నమోదు చేసుకుంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో పెద్దగా కంటెంట్ లేకపోవడం .. తెలిసిన కథనే తెరకెక్కించడం .. గ్రాఫిక్స్ కూడా నాశిరకంగా ఉండడం జనాలకు ఇబ్బందికరంగా అనిపించాయి . అంతేకాదు సమంత ఫ్యాన్స్ కూడా ఓపెన్ గా ఒప్పుకునేస్తున్నారు .

ఈ క్రమంలోనే గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో సమంత శాకుంతలం సినిమాకి సంబంధించిన నెగటివ్ టాక్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది . కాగా సమంత శాకుంతలం సినిమా బాగాలేదు అంటూ ఏకంగా సమంతకి ఓపెన్ గా చెప్పుకొచ్చాడు . దీంతో సమంత ఫుల్ ఫైర్ అయిపోయింది . ఈ క్రమంలోనే ఏకంగా ఆ యూజర్ ఐడి ని బ్లాక్ చేసి పడేసింది .

దీంతో ఫుల్ ఫైర్ అయిపోయిన ట్విట్టర్ యూజర్ ..ఏకంగా స్క్రీన్ షాట్ ను ఇప్పుడు వైరల్ చేస్తున్నాడు. ఈ క్రమంలోని సమంతకు ఇంత కోపమా ..? బాగాలేని సినిమాను బాగాలేదు అని చెప్పిన కారణంగా ఇలా చేస్తుందే అంటూ ఫైర్ అవుతున్నారు . అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో హిట్లు – ప్లాపులు సర్వసాధారణమని .. ఆ మాత్రం దానికి ఇలా కుంగిపోకూడదు అంటూ సమంతకి సజెషన్స్ ఇస్తున్నారు . ఆ యూజర్ మాత్రం..”నేను చూసిన డిజాస్టర్ సినిమాలలో శాకుంతలం ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది” అంటూ చెప్పడమే కాకుండా సమంతను అతి ఓవరాక్షన్ తగ్గించుకోమంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే సమంత శాకుంతలం సినిమా నెగిటివ్ టాక్ మరింతగా వైరల్ అవుతుంది..!!