వర్మ చేతిలో మందు.. పక్కన సురేఖ వాణి .. యవ్వారం మామూలుగా లేదుగా..!!

టాలీవుడ్లో సీనియర్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.గతంలో ఎన్నో సినిమాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు. ఈ మధ్యకాలంలో మాత్రం బోల్డ్ సినిమాలను మాత్రమే తెరకెక్కిస్తూ కొంతమంది యాక్టర్స్ ను మంచి పాపులారిటీ చేస్తున్నారు. రాంగోపాల్ వర్మ వల్లే కొంతమంది ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. తాజాగా ఇప్పుడు సురేఖ వాణి రాంగోపాల్ వర్మ కలసి ఒక పార్టీలో దిగినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

సీనియర్ నటి క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరుపొందిన సురేఖవాణి గతంలో చాలా పద్ధతిగా కనిపించేది..ఈ మధ్యకాలంలో తన కూతురితో కలిసి చేసేటువంటి ఫోటోలు, వీడియోల వల్ల తరచూ వార్తలు లోనే నిలుస్తూ ఉంది. ముఖ్యంగా తన కూతుర్ని మించిన అందంతో ఉండడంతో కుర్రకారులు సైతం ఈమె అందానికి ఫిదా అవుతున్నారు. నటిగా ఈ మధ్యకాలంలో తక్కువ సినిమాలలో నటిస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలను షేర్ చేస్తే తెగ వైరల్ గా మారుతోంది. తాజాగా సురేఖ వాణి ,రాంగోపాల్ వర్మతో కలిసి పార్టీలో దిగినట్టుగా తన సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ గా కొన్ని ఫోటోలను స్వయంగా షేర్ చేసింది సురేఖ వాణి.


ఈ ఫోటోలలో రాంగోపాల్ వర్మతో చాలా క్లోజ్ గా ఉన్న సురేఖ వాణి ఈ ఫోటోలలో కనిపిస్తోంది.ఇలాంటి పార్టీలు వర్మకి మాత్రం కొత్తేమీ కాదు గతంలో కూడా ఎంతోమంది హీరోయిన్లతో సైతం పార్టీలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే వర్మతో కలిసి ఫోటోలు దిగడంతో ఈమె పైన పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్.