రెండేళ్లలో 5 భారీ బడ్జెట్ సినిమాలు.. హీరోయిన్ సంయుక్త మీనన్ ..!!

ఏదైనా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే చాలా కష్టమని చెప్పవచ్చు. టాలెంట్ తో పాటు చాలా అదృష్టం కూడా ఉండాలని ఎంతో మంది హీరోయిన్లను చూస్తే ఆ విషయం రుజువు అవుతుంది.. ఎంతో కష్టపడ్డ అవకాశాలు మాత్రం అంతంత మాత్రం గానే వస్తూ ఉంటాయి కానీ కొందరి విషయంలో మాత్రం అదృష్టం వెంటపడుతూ ఉంటుంది. అలా అదృష్టాన్ని అరచేతిలో పెట్టుకొని వచ్చిన కన్నడ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ కూడా ఒకరు. గత ఏడాది పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో ఇమే తెలుగు తెరకు పరిచయమైంది.

Samyuktha Menon will be part of 'Bheemla Nayak' | Moviekoop
తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ నటనతో కూడా మంచి మార్కులు కొట్టేసింది ఇక మిగతా సినిమాల్లో మాత్రం ఈమె నటనకు ప్రశంసలు అందుకుందని చెప్పవచ్చు. దిండిసార సినిమాతో మరొకసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టేసింది. పాత్రకి ప్రాధాన్యత లేకపోయినా తన స్కిన్ షో తో గ్లామర్ తో ఆకట్టుకుంది. ఇక ఈ ఏడాది విడుదలైన ధనుష్ సార్ సినిమాలో హీరోయిన్గా నటించి అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఇందులో ధనుష్ సంయుక్త మీనన్ మధ్య జరిగే సన్నివేశాలు బాగానే ఆకట్టుకున్నాయి.

పద్ధతిగానే చంపేస్తున్న సంయుక్త మీనన్.. ఫొటోస్ చూస్తే మతిపోతుంది | samyuktha  menon latest instagram photos viral on social media details, samyuktha menon,  latest photos, social media, photos viral ...
తాజాగా హీరో సాయి ధరంతేజ్ నటిస్తున్న విరుపాక్ష సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్ ట్రైలర్ కూడా ఈమె క్యారెక్టర్ కీలకంగా మారనుంది. వీటితో పాటు తాజాగా షూటింగ్ చేసుకుంటున్న డెవిల్ సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా నటిస్తోంది. ఇలా ఇండస్ట్రీకి లోకి వచ్చిన రెండేళ్లలోనే బడ అవకాశాలు కొట్టేయడంతో ఈమె అదృష్టం మామూలుగా లేదు అంటూ అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఈమె వెనక ఒక బడ డైరెక్టర్ ఉన్నారు కనుక ఇన్ని అవకాశాలు వస్తున్నాయని కామెంట్లు చేస్తున్నారు.