యష్-19 చిత్రం లేడీ డైరెక్టర్ తోనా.. ఊహించలేదు బాస్..!!

కే జి ఎఫ్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో పేరు సంపాదించారు కన్నడ హీరో యష్ . ఇప్పటివరకు తన నెక్స్ట్ సినిమా ఏమి కూడా ప్రకటించలేదు. కానీ అభిమానులకు మాత్రం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కేజిఎఫ్ తరహాలో తెరకెక్కించిన ఈ సినిమా ఎంతటి క్రేజీని తెచ్చిపెట్టిందో అలాంటి కథ కోసమే వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంతోమంది దర్శకులు కథలు విన్నా కూడా వాటిపైన పెద్దగా ఆసక్తి చూపించలేదని వార్తలు కన్నడ ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్నాయి.

Yash To Do His Next In The Direction Of Geetu Mohandas | cinejosh.com
మళ్లీ కూడా మాఫియా బ్యాక్ డ్రాప్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . రీసెంట్గా కేజిఎఫ్ చాప్టర్-3 కూడా రాబోతోందని హోంబలే ఫిలిమ్స్ నిర్మాత విజయ్ కిరంగదూర్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి మరో మూడు ఏళ్ల సమయం పట్టి అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా యష్-19 వ చిత్రానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెరమీదకి రావడం జరిగింది. అదేమిటంటే మలయాళం లో యాక్టర్ దర్శకురాలు గీతు మోహన్ దాస్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

హీరోయిన్గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె ఆ తర్వాత రైటర్ గా మారి ఇప్పుడు దర్శకురాలిగా సత్తా చాటుతోంది. ఇప్పటికే మూడు సినిమాలు దర్శకత్వం వహించక రీసెంట్గా ఆమె ఒక మాఫియా బ్యాక్ డ్రాప్ కథ ను యష్ కు చెప్పడం జరిగిందట. కథ బాగా నచ్చడంతో ఓకే చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించి స్క్రిప్ట్ వరకు కూడా జరుగుతోందని ఇది కంప్లీట్ అయ్యాక అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లేడీ దర్శకురాలు యష్ తో సినిమా చేస్తోందంటే అది కచ్చితంగా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టు అని అభిమానులు భావిస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.