బాలయ్య పై షాకింగ్ కామెంట్లు చేసిన నటుడు శివాజీ..!!

గతంలో నటుడు శివాజీ హీరోగా సైడ్ క్యారెక్టర్ గా పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు. ఈ తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. తెలుగులో హీరోగా మాత్రమే కాకుండా కమెడియన్ గా కూడా ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించారు. శివాజీ నటించిన బూచమ్మ బూచాడు సినిమా అప్పట్లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత దాదాపుగా 50 పైగా సినిమాలలో నటించారు శివాజీ. ఇక ఈ నటుడు సినిమాలలోనే కాకుండా రాజకీయాలలోకి కూడా ఎంట్రీ ఇచ్చి ఎన్నోసార్లు విమర్శలకు గురయ్యారు.

Sivaji Archives | Telugu360.com

బిజెపి పార్టీలోకి చేరి అప్పుడప్పుడు ఏదో ఒక కామెంట్లను చేస్తూ ఉంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు శివాజీ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.. తాను టాలీవుడ్లో హీరోల అందరి సినిమాలలో నటించాను నేను నటించిన సినిమాలు నా అదృష్టవశాత్తు అని సూపర్ హిట్గా నిలిచాయి.అలా నేను టాలీవుడ్ లో ప్రతి ఒక్క హీరోల సినిమాలు నటించానని తెలిపారు. తాను నటించిన ఒకటి రెండు సినిమాలు మాత్రమే ఫ్లాప్ గా మిగిలాయి అని మిగిలిన చిత్రాలన్నీ కూడా సక్సెస్ అయ్యాయి.

Legendary Tollywood Trio to grace Balakrishna's Unstoppable

బాలకృష్ణ గారి సినిమా ఎలా మిస్సయింది అని యాంకర్ అడగగా అది నాకు తెలియదు బాలకృష్ణ గారి సినిమాలో సాయికుమార్ గారు చేశారు..వాస్తవానికి ఆ సినిమాలో క్యారెక్టర్ నేను నటించాలి.. క్యారెక్టర్ చేయడానికి నన్ను పిలిచారు కానీ ఎందుకో ఎవరు ఏమనుకున్నారో తెలియదు ఆ క్యారెక్టర్ లో సాయికుమార్ గారు నటించారని తెలిపారు. అలా ఆ సినిమాలో మిస్సయిందని.. ఎందుకో నాకు ఫస్ట్ నుంచి బాలయ్య గారి సినిమాలు కుదిరివి కావు నేను ఇండస్ట్రీలో అందరి హీరోలతో నటించాను ఒక బాలకృష్ణ గారి సినిమాలో నటించలేదని తెలిపారు.బాలకృష్ణ గారు కూడా తనని ఎందుకు దూరం పెట్టారో అన్నది అర్థం కాలేదని తెలిపారు శివాజీ.