అబ్బబ్బా..ఏం తెలివి రా బాబు.. ఈ మహేశ్ బుర్ర కి గుడి కట్టాల్సిందే..ఏం చేసాడో తెలుసా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ఎంత తెలివైనవాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చిన్న ఏజ్ లోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ఘట్టమ నేని వారసుడు.. ప్రజెంట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో ఓ సినిమాలు నటిస్తున్నాడు . అంతేకాదు ఈ సినిమా పూర్తయిన వెంటనే దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో మరో సినిమాకి కమిట్ అయ్యాడు . ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అవుతూ హ్యూజ్ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న మహేష్ బాబు.. మరోవైపు బిజినెస్ లో కూడా ముందుకు తీసుకెళ్తున్నాడు .

ఈ క్రమంలోనే బిజినెస్ ద్వారా కోట్లు సంపాదించిన మహేష్ బాబు త్వరలోనే హైదరాబాద్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన ఏఎంబి సినిమా మాల్ ని బెంగళూరులో సైతం విస్తరింపజేయాలని భావిస్తున్నారట . దీనికి సంబంధించిన పనులు మొత్తం చక చక పూర్తి చేసేస్తున్నాడు మహేష్ బాబు . అంతేకాదు ఇప్పటికే ఫారిన్ కంట్రీస్ లో కూడా ఫుడ్ బిజినెస్ తో కోట్లు ఆస్తులను కూడబెడుతున్న మహేష్ బాబు బెంగళూరులోనే ఏఎంబి మాల్ ఎందుకు ఓపెన్ చేయాలి అనుకుంటున్నాడో కూడా ఓ న్యూస్ వైరల్ అవుతుంది .

కన్నడ ఇండస్ట్రీలో కూడా మహేష్ బాబు కాళ్ళు మోపాలనుకుంటున్నాడని . ఈ క్రమంలోనే అక్కడ కూడా తన క్రేజ్ ను పెంపొందించుకునేలా చేస్తున్నాడు అని జనాలు చెప్పుకొస్తున్నారు . అంతేకాదు మహేష్ బాబు తెరపై ఎంత బాగా స్మార్ట్ గా నటిస్తాడో.. తెర వెనుక అంత స్మార్ట్ గా బిజినెస్ డీల్స్ ను ఫిక్స్ చేస్తాడని.. ఎటువంటి బిజినెస్ లోనైనా సరే నెంబర్ వన్ ప్రాఫిట్స్ అందుకోవడం మహేష్ బాబు టార్గెట్ అని .. ఇప్పటివరకు చేసిన అన్ని బిజినెస్ లోను సూపర్ సక్సెస్ అయ్యాడు అన్న విషయం అభిమానులు హైలెట్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే కొందరు ఫాన్స్ మహేష్ బాబుకి దండేసి దండం పెట్టాలి అంటూ ఆయన పిక్స్ ని ట్రెండ్ చేస్తున్నారు..!!