హీరోలతో పాటు రెమ్యూనరేషన్ అందుకుంటున్న టాలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!!

సినిమా అంటేనే హీరో , హీరోయిన్స్ మాత్రమే గుర్తొస్తారు. కానీ ఆ సినిమా పెద్దగా సక్సెస్ కావాలన్నా ఆ సినిమాకి పేరు ప్రఖ్యాతలు రావాలన్నా డైరెక్టర్ ముఖ్యం. ఇండియాలో డైరెక్టర్స్ కు పాపులారిటీ చాలా తక్కువ ఒక్క పాపులారిటీనే కాదు రెమ్యూనరేషన్ కూడా తక్కువే. ప్రస్తుతం టాలీవుడ్ లో చాలామంది డైరెక్టర్స్ హీరోలకు సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో ఆ డైరెక్టర్ల గురించి ఒకసారి తెలుసుకుందాం.

Beards the reason behind their blockbusters! | cinejosh.com
1). రాజమౌళి :
తెలుగు సినీ పరిశ్రమను హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి..ఒక్కో సినిమాకి రూ .100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే సినిమాలో కూడా భాగమవుతారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.

2) త్రివిక్రమ్ శ్రీనివాస్:
మాటల మాంత్రికుడిగా గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఒక్కో చిత్రానికి రెమ్యూనరేషన్ రూ.35 నుంచి రూ .40 కోట్లు అందుకుంటారట.

3). సుకుమార్ :
పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారాడు సుకుమార్. ఈయన ఒక్కో సినిమాకి రూ.35 నుంచి రూ .50 కోట్లు అందుకుంటారట.

4) కొరటాల శివ :
డైరెక్టర్ కొరటాల శివ హ్యాట్రిక్ విజయాలు అందుకోవడంతో స్టార్ డైరెక్టర్ గా పేరు పొందారు.. కానీ ఆచార్య సినిమా డిజాస్టర్ తో కోలుకోలేని దెబ్బ పడింది. ఈయన ఒక్కో సినిమాకు రూ .25 కోట్ల నుంచి రూ .30 కోట్ల వరకు తీసుకుంటారట.

5). అనిల్ రావిపూడి :
వరుస చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లను సాధించిన అనిల్ రావిపూడి దాదాపు ఒక్కో చిత్రానికి రూ .20 నుంచి రూ .25 కోట్ల అందుకుంటున్నారట.

6). బోయపాటి శ్రీను:
ఈయన మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకొని ఒక్కో సినిమాకి రూ .22నుంచి రూ .28 కోట్లు అందుకుంటారట

7).వంశీ పైడిపల్లి:
తెలుగు ఇండస్ట్రీలో ఈయన సూపర్ హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకొని ఒక్కో చిత్రానికి గాను రూ .18 నుంచి రూ .25 కోట్లు అందుకుంటాడు.