చిన్న వయసులోని పెళ్లి చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్లు వీళ్లే..!

చిత్ర పరిశ్రమలో హీరోయిన్లు ఎప్పుడు పెళ్లిళ్లు చేసుకుంటారు అంటే వారికి అవకాశాలు తగ్గిపోయి.. ఇంకా మనం చేసేదేమి లేదు అనుకున్న సమయంలో పెళ్లికి రెడీ అవుతారు.. అందులో నిజం కూడా లేకపోలేదు. ఇక 30 దాటినా కూడా పెళ్లి చేసుకొని హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అలాంటి ఈ చిత్ర పరిశ్రమలో 20 ఏళ్లకే పెళ్లి చేసుకున్న హీరోయిన్లు కూడా ఉన్నారు. పాతికేళ్లు కూడా రాకుండానే కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇస్తారు. ఇలా ఒక్కరో ఇద్దరో కాదు.. దాదాపు డజన్ మంది ముద్దు బొమ్మలు చాలా చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నారు. నాటి దిమంగత నటి దివ్య భారతి నుంచి నేటితరం సయేషా సైగల్ వరకు అలాంటి హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

 సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అంటే అవకాశాలు తగ్గిపోయి.. ఇంక చేసేదేం లేదు అనుకున్నపుడు అంటూ సమాధానం చెప్తుంటారు. అందులో నిజం కూడా లేకపోలేదు. 30 దాటినా కూడా పెళ్లి చేసుకోని హీరోయిన్లు చాలా మంది ఉన్నారు మన ఇండస్ట్రీలో. అలాంటి ఈ ఇండస్ట్రీలోనే 20 ఏళ్ళకే పెళ్లి చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు.

దివంగత సీనియర్ స్టార్ హీరోయిన్ దివ్యభారతి అతి చిన్న వయసులోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. దివ్యభారతి కేవలం 18 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుని అతి చిన్న వయసులోనే మరణించిన విషయం మనకు తెలిసింది. ఇక కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ భార్య శాలిని కూడా ఒకప్పటి హీరోయిన్ అనే విషయం మనకు తెలిసిందే. ఇక వీరిద్దరూ ఓ సినిమాలో నటించే సమయంలో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఇక అజిత్‌తో శాలిని పెళ్లి అయ్యే సమయానికి ఆమె వయసు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే.

అఖిల్ అక్కినేని హీరోగా వచ్చిన తొలి సినిమాపేరు అఖిల్. ఆ సినిమాలో హీరోయిన్‌గా సయేషా సైగల్ నటించింది. ఈమె కూడా కేవలం 21 సంవత్సరాల వయసులోనే మరో హీరో ఆర్య ని పెళ్లి చేసుకుంది. మరో మలయాళీ స్టార్ హీరోయిన్ నాని హీరోగా వచ్చిన అంటే సుందరానికి సినిమాలో నటించిన నజ్రియా నజీమ్ కూడా కేవలం 20 సంవత్సరాల వయసులోనే మరో మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

 6. అదితిరావు హైదరీ:,[object Object],పెళ్లి సమయంలో వయసు 24

ఇక మరో మలయాళీ భామ అమలాపాల్ కూడా కేవలం 20 సంవత్సరాల వయసులోనే దర్శకుడు విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే తర్వాత కొన్ని రోజులకే విడాకులు తీసుకున్నారు. బొమ్మరిల్లు సినిమాతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న జెనీలియా కూడా 24 సంవత్సరాల వయసులోనే బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్‌ని పెళ్లి చేసుకుంది. ఇక ఈ మధ్యకాలంలో హీరో సిద్ధార్థ్ తో ప్రేమలో ఉందన్న వార్తలతో హాట్ టాపిక్ గా మారిన అదితి రావు హైదరి కూడా కేవలం 24 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత విడాకులు ఇచ్చి ప్రస్తుతం సిద్ధార్థ్‌ తో డేటింగ్ లో ఉంది. ఇలా ఈ ముద్దుగుమ్మలే కాకుండా మరికొందరు హీరోయిన్లు కూడా తమ చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని తమ అభిమానులకు షాక్ ఇచ్చారు.