సీనియర్ల నుంచి జూనియర్ల వరకు లిప్ లాక్ లతో అదరగొడుతున్న స్టార్ హీరోలు వీళ్లే..!

ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల‌లో లిప్ లాక్ సీన్లు ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు అక్కడ లిప్ లాక్ సీన్ల కంటే అధికంగానే చూపిస్తున్నారు. అయితే టాలీవుడ్ లో మాత్రం ఒకప్పుడు ముద్దు అంటే ఆ మాడ‌దూరం పారిపోయే హీరోలు..ఇప్పుడు మాత్రం లిప్ లాక్ సన్నివేశాలో నటిస్తూ యూత్ ని బాగా మెప్పిస్తున్నారు. సీనియర్ హీరోలు సైతం తమ సినిమాలలో లిప్ లాక్ లు ఇచ్చేందుకు సై అంటున్నారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు లిప్ లాక్ సీన్లతో అదరగొడుతున్న హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

నాగార్జున :
సీనియర్ హీరోలు ముద్దు సీన్స్ లో నటించడం అంతే సాహసం అనే చెప్పాలి. కానీ ఆ హద్దులను చేరిపేసాడు నాగార్జున. మన్మధుడు 2 సినిమాలో నాగార్జున లిప్ లాక్ సన్నివేశాల్లో రెచ్చిపోయాడు. అది చూసి అభిమానులు కూడా షాక్ అయ్యారు. నాగార్జున ఆరు ప‌దుల వ‌య‌స్సులో కూడా త‌న‌కంటే వ‌య‌స్సులో చాలా చిన్న‌ది.. అందులోనూ త‌న కొడుకు నాగ‌చైత‌న్య ప‌క్క‌న న‌టించిన ర‌కుల్‌తో లిప్‌లాక్ చేయ‌డం ప్రేక్ష‌కులు జీర్ణించుకోలేక‌పోయారు.

మ‌హేష్‌బాబు :
అస‌లు హీరోయిన్ల‌తో రొమాన్స్ చేసేందుకే సిగ్గుప‌డుతూ.. వాళ్ల‌ను సినిమాల్లో ట‌చ్ చేసేందుకే దూరంగా ఉండే సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు లిప్ లాక్ సీన్ లలో నటిస్తాడని ఎవరూ ఊహించలేదు. కానీ పాత్ర డిమాండ్ చేయడం తో బిజినెస్ మ్యాన్ సినిమాలో కాజల్ తో లిప్ లాక్ సీన్ లో నటించాడు. సమంత కు సైతం దూకుడు సినిమాలో ముద్దు పెట్టాడు.

అల్లు అర్జున్ :
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వరుడు సినిమాలో ఎవరో ఊహించని విధంగా లిప్ లాక్ సన్నివేశం లో నటించి ఆశ్చర్య పరిచాడు. అంతే కాకుండా ఆర్య -2 సినిమాలో కూడా కాజల్ కు లిప్ లాక్ ఇచ్చాడు.

Tollywood's Ten new liplock scenes in 2022 | The Times of India

రవితేజ :
మాస్ మహరాజ్ ఏకంగా నలుగురు హీరోయిన్ లతో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించాడు. డింపుల్ హాయతి, మీనాక్షి చౌదరి, పవర్ సినిమాలో రెజీనా, కిక్ 2 లో రకుల్ ప్రీత్ సింగ్ లతో రవితేజ ముద్దు సీన్లలో నటించి యూత్‌కు నిద్ర లేకుండా చేశాడు.

ఆ విషయంలో రష్మిక చాలా ఫీల్ అయ్యిందట.. | Rashmika Upset With That Trolls With Vijay Devarakonda Liplock Details, Dear Comrade, Rashmika, Rashmika Mandanna, Vijay Devarakonda, Rashmika Mandanna Upset, Good Bye Movie, Amitab ...

విజ‌య్ దేవ‌ర‌కొండ :
లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ సైతం రొమాన్స్ తో రెచ్చిపోతున్నాడు. విజయ్ అర్జున్ రెడ్డి సినిమాలో నటించిన ముద్దు సీన్లకు అమ్మాయిలు, అబ్బాయిలు ఫిదా అయ్యారు. ఆ తరవాత డియర్ కామ్రేడ్, గీతా గోవిందం, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ సినిమాల్లో సైతం విజయ్ రెచ్చిపోయాడు.

నాని :
నాచురల్ స్టార్ నాని అలాంటి సీన్ లో నటిస్తాడు అని ఎవరూ ఊహించలేదు. కానీ నాని రీసెంట్ గా శ్యాం సింగరాయ్ సినిమాలో కుర్ర హీరోయిన్ కృతి శెట్టిని నలిపేసాడు. పాత్ర డిమాండ్ చేయడం తో లిప్ లాక్ సన్నివేశంలో నటించాడు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఒక్క సినిమాలో లిప్ లాక్ సన్నివేశంలో నటించి అందర్నీ షాక్ అయ్యేలా చేశాడు. పవన్ తీన్ మార్ సినిమాలో త్రిషకు లిప్ లాక్ ఇచ్చాడు. ఈ సినిమాలో రొమాంటిక్ హీరోగా నటించాడు.

ప్ర‌భాస్ :
బాహుబలి సినిమాలో కూడా ప్రభాస్ అనుష్క కు లిప్ లాక్ ఇచ్చాడు. కానీ ఫైనల్ ఎడిటింగ్ లో ఆ సీన్ ను జక్కన్న కట్ చేశాడు. కాగా ఆ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి.

నాగ‌చైత‌న్య :
ఏం మాయ చేసావే సినిమాలో సమంత నాగ చైతన్యలు ఎన్ని లిప్ లాక్ సీన్ లలో నటించారో లెక్కపెట్టలేం. ఆ తర్వాత కూడా నాగచైతన్య కొన్ని సినిమాల్లో ముద్దు సీన్ లలో నటించాడు.