ఉపాసన డెలివరీ డేట్ లాక్‌.. మెగా వారసుడి ఎంట్రీ ఎప్పుడో తెలుసా?

మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. పెళ్లి జరిగిన పదేళ్ల తర్వాత ఉపాసన గర్భం దాల్చడంతో మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరోవైపు మెగా అభిమానుల సైతం ఈ శుభవార్త వినేందుకు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ఉపాస‌న త‌న ప్రెగ్నెన్సీ జర్నీని ఎంజాయ్ చేస్తోంది. రామ్ చ‌ర‌ణ్ సైతం ఎక్కువ స‌మ‌యాన్ని భార్య‌కే కేటాయిస్తున్నాడు. ఆమెను దేశ‌విదేశాల‌కు తిప్పుతున్నాడు. అలాగే ఇంతకు ముందు ఫ్రెండ్స్ అంతా ఉపాసనకు సీమంతం జరపగా.. రీసెంట్ గా దుబయ్ లో ఉపాసన సిస్టర్స్ ఈ వేడుకను జరిపారు.

తాజాగా తమ ఇంటి కోడలికి మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ గా సీమంతం చేశారు. ఇక‌పోతే ఉపాసన త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఉపాసన డెలివరీ డేట్ కూడా లాక్ అయింది. జులై నెలలో ఉపాస‌న‌కు డెలివరీ డేట్ ఇచ్చారని.. అప్పుడే మెగా వార‌సుడు ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. ఇక త‌మ తొలి బిడ్డ కోసం ఉపాస‌న దంప‌తులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్ త‌న బిడ్డ‌తో గ‌డిపేందుకు దాదాపు మూడు నెల‌లు షూటింగ్స్ కు బ్రేక్ ఇవ్వ‌బోతున్నాడ‌ట‌.