సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం ఈ ప్రపంచంలోకి ఒక్కసారి ఎంటర్ అయ్యాక ఎంత తెల్లటి మనసుతో ఉన్నవారు అయినా అక్కడ ఉన్న రంగుల మాయలో పడిపోవాల్సిందే. చాలామంది అమ్మాయిలు హీరోయిన్లుగా ఒక వెలుగు వెలగాలని వెండితెరపై తమను తాము చూసుకోవాలని ఎన్నో కలలతో చిత్ర పరిశ్రమలో అడుగు పెడతారు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేముందు చాలా పద్ధతిగా ఉండే అమ్మాయిలు స్టార్ హీరోయిన్లు అయిన వెంటనే తమ బిహేవియర్ మార్చేస్తారు.
తాము ఎక్కడ నుంచి వచ్చాము తమ సంస్కృతి సంప్రదాయాలను కూడా మర్చిపోతారు. సరికొత్త ఊహ ప్రపంచంలోకి వెళ్లిపోతారు. స్టార్ హీరోయిన్ అయ్యాక చెడు అలవాట్లకు బానిస అయ్యి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ఇప్పటి తరం హీరోయిన్లు తాగటం, సిగరెట్లు ఊదటం పబ్బులకు, క్లబ్బులకు వెళ్లటం కామన్ అయిపోయింది. అయితే పాత తరంలోనూ మహానటి సావిత్రితో మొదలు పెడితే చాలామంది హీరోయిన్లు మద్యానికి బానిసై తమ కెరీర్ నాశనం చేసుకున్నారు.
ఇటీవల కాలంలో కొందరు హీరోయిన్లు కూడా మద్యం సేవిస్తూ మీడియా కంటపడ్డారు. మరికొందరు పబ్బుల్లోనూ, క్లబ్బుల్లోనూ మందు కొడుతూ అడ్డంగా దొరికిపోయారు. లోకనయకుడు కమలహాసన్ కూతురు శృతిహాసన్ షూటింగ్‌లు లేకపోతే బెంగళూరులోని పబ్బులకు వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తూ మందు కొడుతుంది అన్న టాక్ ఉంది, ఒకవేళ హ్యాంగ్ ఓవర్ అయితే శృతి చాలా లేటుగా షూటింగ్ కు వస్తుందన్న గుసగుసలు కూడా ఉన్నాయి.
ఒకప్పటి సీనియర్ హీరోయిన్ ఊర్వశి కూడా మద్యం సేవించేదట. అంతేకాకుండా గతంలో ఒకటి రెండు సార్లు ఆమె ఫుల్‌గా మందు కొట్టి ఫంక్షన్లకు హాజరైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అన్న ప్రచారం కూడా జరిగింది. అందుకు సంబంధించిన వీడియోలు కూడా యూట్యూబ్ లో దర్శనమిస్తూ ఉంటాయి. ఇక చెన్నై ముద్దుగుమ్మ త్రిష కూడా చాలాసార్లు ఫుల్‌గా మద్యం తాగి మీడియాకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఎక్కడో ఎందుకు హైదరాబాద్‌లో దగ్గుబాటి రానాతో మందు కొట్టి తూలుతూ మీడియా కెమెరాలకు చిక్కిన సంగతి తెలిసిందే. అలాగే ఓ స్టార్ హీరోతో కలిసి మందు కొట్టి గోవాలోనూ దొరికిపోయిందన్న టాక్ బయటకు వచ్చింది.
ఇక దేశముదురు ముద్దుగుమ్మ హన్సిక సైతం సినిమాల్లో నటించే సమయంలో కొన్ని సీన్లలో తాగి నటించాల్సి వస్తే నిజంగానే తాగి సెట్స్ కు వచ్చి నానా హడావుడి చేస్తుందట. వీరు మాత్రమే కాదు శ్రద్ధాదాస్, చార్మి లాంటి హీరోయిన్లు ఓపెన్ గానే మందు కొడుతు ఉన్న ఫోటోలు ఎన్నోసార్లు బయటకు వచ్చాయి. ఇక పాత తరం హీరోయిన్లలో మహానటి సావిత్రి, శుభ ఇలా ఎంతోమంది క్రేజీ హీరోయిన్లు మద్యానికి బానిసై తమ కెరీర్‌ను పోగొట్టుకున్నారు.