కంచం, మంచం అంటూ మహిళలపై నోరు జారిన‌ రవితేజ.. ఏకేస్తున్న నెటిజ‌న్లు!

మ‌హేళ‌ల‌ను కించ‌ప‌రుస్తూ మాస్ మ‌హారాజా ర‌వితేజ నోరు జారారు. ఇదే ఇప్పుడు వివాదం అయింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ర‌వితేజ నేడు `రావ‌ణాసుర‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో క్రైమ్స్ కి పాల్పడే క్రిమినల్ లాయర్ గా ర‌వితేజ న‌టించాడు.

వైలెన్స్, అడల్ట్ కంటెంట్ ఎక్కువ‌గా ఉండ‌టంతో సెన్సార్ వ‌ద్ద `ఏ` స‌ర్టిఫికేట్ సొంతం చేసుకున్న ఈ చిత్రం.. నేడు అట్ట‌హాసంగా విడుద‌లైంది. ఆల్మోస్ట్ అన్ని వైపుల నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు వ‌స్తున్నాయిది. ఇదిలా ఉంటే.. ఎడిట్ సూట్ నుంచి 9 సెకన్ల నిడివి ఉన్న వీడియో లీక్ కాగా అంతర్జాలంలో ఇది డిబేట్ కి తెర తీసింది.

లీక్డ్ వీడియోలో రవితేజ `కంచం ముందుకి మంచం మీదకి ఆడపిల్లలు పిలవంగానే రావాలి. లేకపోతే నాకు మండుద్ది రా` అని ఒక అమ్మాయితో కోపంగా అంటాడు. ఈ డైలాగే వివాస్ప‌దం అయింది. ఆడవాళ్లను కించ పరిచే విధంగా ఆ డైలాగ్ ఉందంటూ నెటిజ‌న్లు ఏకేస్తున్నారు. సెన్సార్ సభ్యులు ఇలాంటి బూతు డైలాగ్ కి ఎందుకు కట్ చెప్పలేదంటూ మండిప‌డుతున్నారు. సినిమాలో ఆ డైలాగ్ ను తొల‌గించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

https://twitter.com/prabhakarlive9/status/1643961589710872576?s=20