వావ్.. కీర్తి సురేష్ లైఫ్ లో నే బిగ్ టర్నింగ్ పాయింట్.. అదృష్టం అంటే ఇదేగా..!?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారిపోతుందో ఎవ్వరు చెప్పలేరు . దానికి ఎన్నో ప్రత్యేక నిదర్శనాలు ఉన్నాయి . అయితే రీసెంట్ గా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది టాలీవుడ్ మహానటి గా పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్. అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చేసింది తక్కువ సినిమాలు ..హిట్ కొట్టింది మరీ తక్కువ . అయినా కానీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కి మించిన క్రేజ్ తో రేంజ్ తో ఫాన్ ఫాలోయింగ్ తో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.. అంటే దానికి ఏకైక కారణం మహానటి అనే చెప్పాలి .

ఇండస్ట్రీలో ఇప్పటికీ ఈమెని సావిత్రిగా భావిస్తున్న స్టార్ హీరోలు అమ్మడుతో రొమాన్స్ చేయడానికి కూడా భయపడుతున్నారు . కాగా రీసెంట్ గా నాని దసరా సినిమాలో నటించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కీర్తి సురేష్ కి కోలీవుడ్ ఇండస్ట్రీ ఫిదా అయిపోయింది . ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కీర్తి సురేష్ ఇంటికెళ్లి బిగ్ ఆఫర్ ను అందజేశాడట . కోలీవుడ్ స్టార్ హీరో సినిమాలో అవకాశం ఇవ్వడమే కాకుండా.. ఆమె నటనను ఓ రేంజ్ లో పొగిడేశారట.

నిజానికి మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ వరుస డిజాస్టర్లు అందుకుంటుంది . చెప్పుకోతగా ఆఫర్లు కూడా కీర్తి సురేష్ ఖాతాలో రాకపోవడంతో ఆమె డిలా పడిపోయింది . కానీ అలాంటి క్రమంలోనే చిరంజీవి – మహేష్ బాబు -నాని తమ సినిమాలో అవకాశాలు ఇచ్చి ..తెలుగు ఇండస్ట్రీ ఈమెను ఆదుకుంది. ఇప్పుడు అదే లిస్టులోకి కోలీవుడ్ ఇండస్ట్రీ యాడ్ అయిపోయింది . త్వరలోనే స్టార్ట్ కాబోతున్న ఈ భారీ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తే మాత్రం లైఫ్ టర్న్ అయిపోతుందని .. మరో మహానటి లాంటి సినిమా ఈమె ఖాతాలో పడబోతుంది అంటూ చెప్పుకొస్తున్నారు కోలీవుడ్ జనాలు . చూడాలి మరి కీర్తి సురేష్ జాతకాన్ని ఆ డైరెక్టర్ ఎలా మారుస్తాడో..?