శ్రీ‌లీల గంట‌కు అంత ఛార్జ్ చేస్తుందా.. మ‌రీ ఓవ‌ర్ గా లేదు!

ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ బ్యూటీ శ్రీలీల పేరు ఎంతలా మారుమోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీ లోకి వచ్చి కనీసం రెండేళ్లు కూడా కాలేదు. కానీ అటు యంగ్ హీరోలకు, ఇటు స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 8 సినిమాల్లో నటిస్తోంది.

ఈ లిస్ట్ లో ఎన్‌బీకే 108, ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్, ఎస్ఎస్ఎమ్‌బీ 28, రామ్-బోయ‌పాటి పాన్ ఇండియా మూవీ, వైష్ణవ్ తేజ్ మూవీ, అనగనగా ఒక రాజు, జూనియర్ త‌దిత‌ర ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఇక్క‌డ మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే.. అందరు హీరోయిన్లు రోజల్లో కాల్‌షీట్లు ఇస్తుంటే.. శ్రీలీల మాత్రం గంటల్లో ఇస్తుండటం విశేషం.

ఉదయం ఒక షూటింగ్, మధ్యాహ్నం మరొకటి.. ఇలా సాగిపోతోంది ఆమె కెరీర్. ఈ క్ర‌మంలోనే రెమ్యున‌రేష‌న్ కూడా గ‌ట్టిగా ఛార్జ్ చేస్తుంద‌ట‌. ఒక గంట పాటు ఆమె షూటింగ్ లొకేషన్ లో ఉంటే రూ. 5 లక్షలు ఇవ్వాలని చెబుతుంద‌ట‌. అలా ఎన్ని గంటలు ఉంటె అన్ని 5 లక్షల రూపాయిలు అన్న‌మాట‌. ఇంత డిమాండ్ కేవలం స్టార్ హీరోలకు మాత్రమే ఉంది. కానీ, శ్రీ‌లీల ఈ రేంజ్ లో ఛార్జ్ చేస్తుండ‌టంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. కొంద‌రు నెటిజ‌న్లు అయితే శ్రీ‌లీల మ‌రీ ఓవ‌ర్ చేస్తుంది.. ఇదే కొన‌సాగితే ఇండ‌స్ట్రీలో ఎక్కువ కాలం ఉండ‌టం క‌ష్ట‌మంటూ చుర‌క‌లు వేస్తున్నారు.