నయన్ మూర్ఖత్వం..రాశీఖన్నాకి భలే కలిసొచ్చిందే..? ఒకటి రెండు కాదు ఏకంగా మూడు..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలి అన్న,, వచ్చిన తర్వాత ఆ అవకాశాలను నిలబెట్టుకోవాలి అన్న .. చాలా కష్టపడాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా కోపం , ఆవేశం లాంటివి ఉంటే ఇండస్ట్రీలో నెట్టుకు రాలేరు . ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలి అనుకున్న హీరోయిన్లు కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఉంటారు . అయితే అవకాశాలు రాకపోయినా పర్లేదు మా కోపాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ ని చంపుకోమంటూ కొందరికి హీరోయిన్స్ ఉంటారు . అలాంటి వారిలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది నయనతార .

సౌత్ ఇండస్ట్రీలోనే హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నయనతార .. ప్రజెంట్ ఎలాంటి ఆఫర్స్ తో ముందుకు వెళ్లిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కబోయే జవాన్ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న నయనతార ..కోలీవుడ్ లోను రెండు బడా ప్రాజెక్టు లకు సైన్ చేసింది . ఈ క్రమంలోనే తమిళంలో వైనాట్‌ శశికాంత్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమాలో మొదట హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యింది. లేడీ ఓరియెంటెడ్‌ ఫిల్మ్ గా రూపోందుతున్న ఈ సినిమా లో మాధవన్‌, సిద్ధార్థ్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇటీవల అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

అయితే అనుకున్న కాల్ షీట్స్ కన్నా ఎక్కువ ఈ సినిమాకి కాల్ షీట్స్ అవుతూ ఉండడంతో నయనతారను డైరెక్టర్ స్పెషల్ గా కొన్ని కాల్ షీట్స్ ఇవ్వమని రిక్వెస్ట్ చేశారట . అయితే సెకండ్స్ లోనే కోపం వచ్చేసిన నయనతార ..చెప్పిన దానికన్నా ఒక్క రోజు కాల్ షీట్ ఎక్కువ ఇవ్వనని ఇష్టముంటే చేయించుకొని లేకపోతే తప్పించుకోండి అంటూ ఈ సినిమా నుంచి తప్పుకుంది అంటూ కోలీవుడ్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.

దీంతో నయన్ హెడ్ వెయిట్ చూసిన డైరెక్టర్ ఈ సినిమా నుండి ఆమె పాత్రను తప్పిస్తూ రాశీ ఖన్నాకు ఆఫర్ ఇచ్చారట . ఈ మధ్యకాలంలో రాశి ఖన్నా ఎలాంటి బోల్డ్ రోల్స్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డైరెక్టర్స్ కి కావాల్సిన విధంగా నటిస్తూ మెప్పిస్తుంది. ఈ క్రమంలోనే ఈ పాత్రకి రాశిఖన్నా పర్ఫెక్ట్ అని.. సినిమా నుంచి తప్పించేసారట. ప్రజెంట్ ఇదే న్యూస్ కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏది ఏమైనా నయనతార మూర్ఖత్వం కి రాశీ ఖన్నా భలే ఆఫర్ పట్టేసింది . కేవలం ఇదే కాదు గతంలోనూ నయనతార రిజెక్ట్ చేసిన ఆఫర్లు రెండు మూడు రాశి ఖన్నా చేసి హిట్టు అందుకున్న సందర్భాలు ఉన్నాయి అంటూ చెప్పుకొస్తున్నారు అభిమానులు . ఈ క్రమంలోనే రాశీ ఖన్నా పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది..!!