పవన్ కళ్యాణ్ ని ఇరకాటంలో పెడుతున్న డైరెక్టర్..యవ్వారం తేడాగా ఉందే..!?

ప్రజెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత బిజీ షెడ్యూల్లో రన్ అవుతున్నాడో మనందరికీ బాగా తెలిసిన విషయమే . ఓవైపు రాజకీయాలు.. మరోవైపు సినిమాలు ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తూ తన శక్తిని మొత్తం రెండిటికీ దారపోస్తున్నారు . ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నిలిచిన సినిమా “వకీల్ సాబ్”.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 9 ఏప్రిల్ 2021న గ్రాండ్గా  రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ ను సంపాదించుకుంది . ఈ క్రమంలోనే ఈ సినిమా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో వకీల్ సాబ్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్ . ఈ క్రమంలోనే వకీల్ సాబ్ సినిమా హిట్ అవ్వగానే వకీల్ సాబ్ కి సీక్వెల్ ఉంటుంది అంటూ అనౌన్స్ చేసిన వేణు శ్రీరామ్ టూ ఇయర్స్ కంప్లీట్ చేసిన సందర్భంగా.. ఇవాళ వకీల్ సాబ్ 2 గురించి అప్డేట్ ఇస్తారు అంటూ ఫ్యాన్స్ ఆశపడ్డారు.

అయితే అలాంటిది ఏదీ లేదని ఇంకా ఈ సినిమా అఫిషీయల్ గా కన్ ఫామ్ అవ్వలేదు అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఓవైపు రాజకీయాలతో మరోవైపు కమిట్ అయిన ప్రాజెక్ట్స్ తో బిజీబిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. వకీల్ సాబ్ 2 కి అంగీకరిస్తాడా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ సగం కంప్లీట్ అయింది .

మరోవైపు ఉజ్జాద్ భగత్ సింగ్ షూటింగ్ గాలికి వదిలేసారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి . ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలలోనూ వరుస షెడ్యూల్ ఫిక్స్ అయి ఉన్నాడు . ఇలాంటి టైంలో వకీల్ సాబ్ 2 అనేది సాధ్యమేనా..? అయితే వేణు శ్రీరామ్ మటుకు పవన్ కళ్యాణ్ తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారట. అప్పుడు మాట ఇచ్చారు . ఇప్పుడు మీరు చేసి తీరాల్సిందే అంటూ టార్చర్ చేస్తున్నారట . ఈ క్రమంలోనే వకీల్ సాబ్ 2 పై పవన్ ఫ్యాన్స్ సైతం అప్సెట్ అవుతున్నారు . ప్రజెంట్ పవన్ రాజకీయాలపై ఫోకస్ చేస్తేనే బాగుంటుంది అంటూ సజెస్ట్ చేస్తున్నారు.