అఖిల్‌తో తేజస్వి అఫైర్ పెట్టుకుందా.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ!

సినీ ఇండస్ట్రీలో కొనసాగే వారి మధ్య ప్రేమ చిగురించడం, అది పెళ్లి వరకు వెళ్లి ఆగిపోవడం ఎప్పుడూ జరిగేదే ఒక్కోసారి వీరి ప్రేమ పెళ్లి పీటలు కూడా ఎక్కుతుంది. వారి మధ్య ప్రేమ ఎంతకాలం ఉంటుందో తెలియదు. సమంత, సుమంత్, పవన్ కళ్యాణ్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. కాగా తాజాగా ఇండస్ట్రీలో మరొక కొత్త ప్రేమ కథ స్టార్ట్ అయ్యింది. బిగ్‌బాస్ కంటెస్టెంట్, సినీ నటి తేజస్వి మదివాడ గురించి స్పెషల్ గా పరిచయం అక్కర్లేదు. హీరోయిన్ గానే కాకుండా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాల్లో సైడ్ రోల్స్ చేసి పాపులర్ అయ్యింది.

ఇక ఈ ముద్దుగుమ్మ సినిమాలు కంటే కాంట్రవర్సీలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది. రామ్ గోపాల్ వర్మ తీసిన ఐస్‌క్రీం మూవీలో పొట్టి నిక్కరేసుకుని థైస్‌ మొత్తం చూపించి హీటెక్కించింది. తర్వాత కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా అందాలను ఆరబోసి సంచలనం అయ్యింది. ఇప్పుడు సోషల్ మీడియాలో కంటే బుల్లితెరపై ఎక్కువగా హైలైట్ అవుతుంది. ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం స్మాల్ స్క్రీన్‌పై ప్రసారమవుతున్న బీబీ జోడిలో బిగ్‌బాస్ ఎక్స్‌ కంటెస్టెంట్ అఖిల్‌తో కలిసి స్టెప్పులు వేస్తోంది. వీరి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ బుల్లితెరపై మంటలు రేపుతోంది. అయితే వీరిద్దరూ జోడిగా జతకట్టిన సమయం నుంచి వారి మధ్య స్నేహం పెరుగుతూ వస్తోంది.

ఆ స్నేహంతోనే వారు బయట కూడా కలిసే తిరుగుతున్నారు. సాధారణంగా లవ్ చేసుకుంటున్న వారు మాత్రమే కలిసి ఎక్కువగా బయట కనిపిస్తుంటారు. దాంతో వీరి మధ్య కూడా ఏదైనా అఫైర్ ఉందా అనే కోణంలో రూమర్స్ మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఆ పుకార్లకు ఆజ్యం పోసింది తేజస్వి. తాజాగా ఈ తార సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్‌తో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ మొదలెట్టింది. అందులో ఒక ఫ్యాన్.. “అఖిల్ గురించి ఏదో ఒక విషయం చెప్పండి మేడం” అని అడిగాడు. దానికి సమాధానంగా అఖిల్ ని ఉద్దేశిస్తూ “హీ ఈజ్ ఏ లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో” అని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రూమర్స్ వస్తున్న నేపథ్యంలో ఇలా కొంటెగా ఆమె చెప్పిన సమాధానం చూసి, వారి మధ్య నిజంగా ఏమైనా ఉందా? అని చాలామంది నోరెళ్లబెడుతున్నారు. మరి ఈ విషయంలో పూర్తి క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.