అలియాకు హ్యాండ్ బ్యాగ్ గిఫ్ట్‌గా ఇచ్చిన ర‌ణ్‌బీర్‌.. ఖ‌రీదు తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

బాలీవుడ్ మోస్ట్‌ ల‌వ‌బుల్ క‌పుల్స్ లిస్ట్ లో ర‌ణ్‌బీర్ క‌పూర్- అలియా భ‌ట్‌ జంట ఒక‌టి. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకుని ఒక‌రినొక‌రు అర్థం చేసుకున్న ఈ జంట‌.. గ‌త ఏడాది ఏప్రిల్ 14న పెళ్లి బంధంతో ఒక‌ట‌య్యారు. పెళ్లి అయిన ఏడు నెల‌ల‌కే అలియా భ‌ట్ పండంటి ఆడ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.

అయితే అలియా భట్, రణ్‌బీర్‌‌ కపూర్ పెళ్లి జరిగి రీసెంట్ గా ఏడాది పూర్తి అయింది. మొదటి వార్షికోత్సవం సందర్భంగా ముంబైలో నిర్మాణంలో ఉన్న సొంత ఇంటిని చూడడానికి వెళ్లారు. అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్లు అలియా, రణ్‌బీర్‌‌లకు యానివర్సరీ శుభాకాంక్షలు తెలిపారు.

ఆ సమయంలో అలియా చేతిలో ఉన్న‌ హ్యాండ్ బ్యాగ్ అంద‌రినీ ఆక‌ర్షించింది. అయితే మొద‌టి పెళ్లి రోజు సంద‌ర్భంగా త‌న ప్రియ‌మైన భార్య అలియాకు ర‌ణ్‌బీర్ క‌పూర్ ఆ అంద‌మైన‌ హ్యాండ్ బ్యాగ్ ను గిఫ్ట్ గా ఇచ్చాడ‌ట‌. అయితే ఇప్పుడు ఆ హ్యాండ్ బ్యాగ్ ఖ‌రీదు తెలిసి క‌ళ్లు తేలేస్తున్నారు నెటిజ‌న్లు. ఎందుకంటే, ఎంతో సింపుల్ గా ఉన్న ఈ హ్యాండ్ బ్యాగ్ ధ‌ర అక్ష‌రాలా రూ. 10 ల‌క్ష‌లు అట‌. ఈ హ్యాండ్ బ్యాగ్ ను ర‌ణ్‌బీర్ లండ‌న్ లో కొనుగోలు చేశాడ‌ని తెలుస్తోంది.