భార్య ఆనందం కోసం అలాంటి ప‌ని చేస్తున్న రామ్ చ‌ర‌ణ్ .. మెగా ఫ్యామిలీలోనే ఫస్ట్ టైం ఇలా..నిజంగా గ్రేట్‌..!!

ఎస్ ప్రెసెంట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సంబంధించిన ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి వన్ అండ్ ఓన్లీ వారసుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు . గత పదేళ్ళుగా మెగా అభిమానులు.. సినీ ఇండస్ట్రీ ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ వచ్చేసింది. త్వరలోనే మెగా కోడలు ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది . ఈ క్రమంలోనే ఉపాసనకి సంబంధించిన ప్రతి న్యూస్ సెకండ్స్ లోనే వైరల్ చేస్తున్నారు మెగా ఫాన్స్.

కాగా రీసెంట్ గానే ఆస్కార్ అవార్డు అందుకున్న రామ్ చరణ్ భార్య కోసం ..భార్య హ్యాపీనెస్ కోసం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. ప్రెసెంట్ ఫారిన్ కంట్రీస్ లో భార్యతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్.. త్వరలోనే ప్యాటర్నిటీ లీవ్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నాడట . ఈ ప్యాటర్నిటీ లీవ్ అనేది కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు తీసుకుంటూ ఉంటారు . భార్య గర్భంతో ఉన్నప్పుడు అన్ని పనులు దగ్గరుండి చూసుకోవడానికి ..భర్తగా తన కర్తవ్యం నిర్వర్తించడానికి.. నిజమైన హస్బెండ్ లు ఇలాంటి లీవ్స్ తీసుకుంటూ ఉంటారు.

ఈ క్రమంలోనే తన భార్యను కేర్ఫుల్ గా చూసుకోవడానికి రామ్ చరణ్ లీవ్ ను తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది . అందుతున్న సమాచారం ప్రకారం జూలై, ఆగస్టులలో ఈ లీవ్ తీసుకోబోతున్నాడట . రెండు నెలలపాటు షూటింగ్స్ బంద్ చేసి మరి తన పూర్తి సమయాన్ని భార్యకి పుట్టబోయే బిడ్డకు కేటాయించడానికి రామ్ చరణ్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు మెగా ఫ్యామిలీలో ఎవరు ఈ విధంగా చేయలేదట.. ఫస్ట్ టైం భార్య కోసం ఇలాంటి పని చేస్తూ అందరి హీరోలకి ఆదర్శంగా నిలుస్తున్నాడు రామ్ చరణ్..!!