లక్ష్మీ ప్రణతి – ఎన్టీఆర్‌కు అన్ని కండిషన్లు పెట్టిందా.. అవేంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి కుటుంబం నుంచి వచ్చిన మూడో తరం హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఎన్టీఆర్‌కు తాత పోలికలే కాకుండా తాతకు తగ్గ మనవడిగా నిరూపించుకున్నాడు. ఇక‌ ఆర్ ఆర్ ఆర్‌ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎన్టీఆర్‌ పై ఇప్పటివరకు ఎలాంటి రోమర్లు కూడా లేవు.

అంతేకాకుండా తన కెరీర్ మంచి ఊపు మీద ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకున్నాడు. నారా చంద్రబాబునాయుడుకి ఎన్టీఆర్ మామగారు వరసకు మేనల్లుడు అవుతారు. అలా ఎన్టీఆర్ తన బంధువులలో ఒకరైన లక్ష్మి ప్రణతిని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఎన్టీఆర్- ప్రణతి దంపతులకు అభయ్ రామ్, భార్గవ్ రామ్ అనే కుమారులు కూడా ఉన్నారు.

Jr.NTR Lakshmi Pranathi: సతీమణి పుట్టినరోజు.. విలువైన కానుక ఇచ్చిన యంగ్  టైగర్.. ఎంటో తెలుసా.. | Jr ntr gift to his wife lakshmi pranathi to her  birthday | TV9 Telugu

ఎన్టీఆర్ ది పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినప్పటికీ బంధువుల అమ్మాయి అవ్వడంతో ఇద్ద‌రు పెళ్లికి ముందు తరచూ ఫోన్లో మాట్లాడుకునే వారట. ఆ సందర్భంలో ఎన్టీఆర్‌కు లక్ష్మీ ప్రణతి కొన్ని కండిషన్లు కూడా పెట్టిందట. పెళ్లి జ‌రిగిన‌ తర్వాత సినిమాలతో బిజీగా ఉన్నా సరే ప్రతి సంవత్సరం రెండు నెలలు ఫ్యామిలీ కోసం కేటాయించాలని ప్రణతి చెప్పిందట. పెళ్లి అవ్వకముందు ఎన్టీఆర్ ఎక్కువగా ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్లేవారట.

The Jr NTR and Lakshmi Pranathi love story: In pics - India Today

పెళ్లి త‌ర‌వాత మీరు ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళడం తగ్గించాలని కూడా చెప్పిందట. ఎన్టీఆర్ తన సినిమా షూటింగ్‌ల్లో అవుట్ డోర్ వెళ్లేటప్పుడు వేసుకునే డ్రెస్సెస్ ని కూడా తానే తీసుకుంటానని ముందే చెప్పిందట. ఇలా ముందుగానే లక్ష్మీ ప్రణతి – ఎన్టీఆర్‌కు కొన్ని కండిషన్లు పెట్టి వాటికి ఎన్టీఆర్ ఒప్పుకున్న తర్వాతే పెళ్లికి అంగీకరించిందట. ఇప్పుడు ఈ జంట టాలీవుడ్ లోనే ఎందరికో ఆదర్శంగా ఉన్నారు.