నెల తిర‌క్క ముందే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `ద‌స‌రా`.. స్ట్రీమింగ్ డేట్ లాక్‌!?

ద‌స‌రా.. న్యాచుర‌ల్ స్టార్ నాని నుంచి వ‌చ్చిన రా అండ్ ర‌స్టిక్ ఫిల్మ్ ఇది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన‌ ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. ఇందులో నాని, కీర్తి సురేష్ జంట‌గా న‌టించారు.

దీక్షిత్ శెట్టి, షైన్‌ టామ్‌ చాకో, సముద్రఖని త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ లాభాల‌ను తెచ్చిపెట్టింది. ఇక ఓటీటీ ప్రియులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ కు వ‌స్తుందా అని ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ రూ. 22 కోట్ల‌కు ద‌స‌రా డిజిట‌ల్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను సొంతం చేసుకుంది. మొద‌ట మే 30 నుంచి దసరా స్ట్రీమింగ్‌ కానున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఈ సినిమా నెల తిర‌క్క ముందే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. నెటిఫ్లిక్స్ వారు స్ట్రీమింగ్ డేట్ ను లాక్ చేశారు. ఏప్రిల్‌ 27 నుంచి నాని సినిమా ఓటీటీలో సందడి చేయ‌బోతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.