స్టార్ హీరోయిన్ నగ్మా కు తెలుగులో బూతులు నేర్పించిన స్టార్ డైరెక్టర్..!

అలనాటి అందాల నటి నగ్మా గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నగ్మా పేరు చెబితేనే 90ల కాలంలో తెలుగు ప్రేక్షకులు పులకించిపోయేవారు. ఆకట్టుకునే ఆమె అందం.. అంతకుమించిన అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసేది. తెలుగులో స్టార్ హీరోలైన చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ లతో నటించి మెప్పించింది. తెలుగులో నగ్మా నటించిన ‘కిల్లర్,’అల్లరి అల్లుడుస‌, ‘ఘరానా మొగుడు, ‘వారసుడు, మేజర్ చంద్రకాంత్, ‘భాషా, ‘ప్రేమికుడు,’ లాంటి చిత్రాలు అప్పట్లో ఘన విజయం సాధించాయి.

Happy Birthday Nagma: The gorgeous actress dated 3 married actors, a  married cricketer, but is single till now - OrissaPOST

అప్పట్లో అరేబియన్ గుర్రం వంటి నగ్మా కోసమే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టేవారు. తెలుగులో చివరగా ఆమె యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అల్లరి రాముడు’ సినిమాలో అత్తగా నటించి అలరించింది. సినిమాలతోనే కాకుండా ఎఫైర్ వార్తలతోను నగ్మా ఫేమస్ అయింది. ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో నగ్మా రిలేషన్ షిప్ లో ఉన్నట్లు అప్పట్లో పుకార్లు షికారు చేసాయి.

అంతేకాకుండా శరత్ కుమార్, రవి కిషన్ తో కూడా ఆమె ప్రేమాయణం సాగించినట్లు అప్పట్లో రూమర్స్ వచ్చాయి. ఆ త‌ర్వాత ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కొంత కాలం బిజీగా గడిపిన నగ్మా ప్రస్తుతం ఖాళీగా ఉండటంతో తనకు కూడా ఎవరైనా యంగ్ హీరోల సినిమాలో అత్త పాత్రలు ఇస్తారేమో అని ఎదురు చూస్తోంది. గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో భాగంగా నగ్మా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పై కొన్ని షాకింగ్ కామెంట్లు చేసింది.

నగ్మా ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు తెలుగు భాష కన్నా తెలుగులో పచ్చి బూతులు బాగా తెలుసు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు దీనికి కారణం దర్శకుడు రాఘవేంద్రరావు అంటూ పువ్వులు, పండ్లుతో తన పై రొమాంటిక్ సాంగ్స్ ను రాఘవేంద్రరావు చిత్రీకరిస్తున్నప్పుడు ఆ సన్నివేశ అర్ధాలను దర్శకేంద్రుడు వివరిస్తూ ఉన్నప్పుడు తనకు ఆ సీన్ లోని బూతు మాటల అర్ధం బాగా తెలియడంతో తనకు తెలియకుండానే తెలుగు భాషలోని బూతులు తనకు వచ్చేసాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది నగ్మా.