అద్గది.. భార్య అంటే అలానే ఉండాలి.. ఎన్టీఆర్ అభిమానులను కుషి చేసిన ప్రణతి..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్న ఎన్టీఆర్ కి ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ అందరిలోకి ఎన్టీఆర్ స్పెషల్ ఐకాన్ లాగా అని చెప్పాలి . ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు .. నచ్చితే చేస్తాడు నచ్చకపోతే చేయడు ..ఆఫ్ కోర్స్ ఈ రోజుల్లో ఇలాంటి హీరో ఇండస్ట్రీలో ఉండడం చాలా రేర్ అని చెప్పాలి. మరి ముఖ్యంగా ఎన్టీఆర్ కి తగ్గట్టే ఆయన భారీ లక్ష్మీ ప్రణతి కూడా బిహేవ్ చేస్తూ ఉంటుంది.

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల భార్యలు ఏ రేంజ్ లో రెచ్చిపోయి హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారో మనకు తెలిసిందే. మరి ముఖ్యంగా బన్నీ భార్య స్నేహారెడ్డి సోషల్ మీడియాని హీరోయిన్స్ కన్నా ఎక్కువ రేంజ్ లో షేక్ చేస్తూ ఉంటుంది. అలాంటి స్టార్ హీరోల భార్యలు ఉన్న ఈ ఇండస్ట్రీలో కూడా ఎన్టీఆర్ భార్య లాంటి వాళ్ళు ఉన్నారు అంటూ జనాలు అప్రిషియేట్ చేస్తున్నారు .

రీసెంట్గా చార్మినార్ లో నైట్ షాపింగ్ చేసింది లక్ష్మి ప్రణతి. మనకు తెలిసిందే రంజాన్ సందర్భంగా చార్మినార్ లో నైట్ షాపింగ్ పెడతారు . ఈ క్రమంలోనే చాలా సింపుల్ లుక్స్ లో లక్ష్మీ ప్రణతి నైట్ బజార్ లో షాపింగ్ చేసింది. దీనికి సంబంధించిన పిక్స్ ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్ . భార్య అంటే ఇలానే ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తూ ఎన్టీఆర్ పేరును ట్రెండ్ చేస్తున్నారు..!!