ఆమె వ‌ల్లే కృతి శెట్టి కెరీర్ నాశ‌నం అవుతుందా.. వెలుగులోకి వ‌చ్చిన షాకింగ్ విష‌యాలు!?

అందాల భామ కృతి శెట్టి కెరీర్ ఆరంభంలోనే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ గ‌త ఏడాది ఈ భామ‌కు ఏమాత్రం కలిసి రాలేదు. కృతి శెట్టి నటించిన ది వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజకవర్గం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి.

దాంతో కృతి శెట్టి గ్రాఫ్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడుకు ఆఫర్లు అంతంత మాత్రంగా మారాయి. దీంతో అవ‌కాశాలు కూడా ఈ బ్యూటీ రెమ్యున‌రేష‌న్ కూడా త‌గ్గించుకునేందుకు రెడీ అయింది. అయితే కృతి శెట్టి కెరీర్ ఇలా నాశనం అవ్వడానికి కారణం ఆమె తల్లి అంటూ ప్రచారం జరుగుతోంది.

తాజాగా ఆమె కెరీర్ కు సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. కృతి శెట్టి కథల ఎంపికలో ఆమె తల్లి నీతి శెట్టి పాత్ర ఉందట. ఈమె కలుగజేసుకుని కథ త‌న‌కు నచ్చితేనే కృతి సినిమా చేస్తుంద‌ని చెబుతుంద‌ట‌. అలా కృతి శెట్టి దగ్గరకు వచ్చిన చాలా సినిమాలను నీతి రిజక్ట్ చేయగా.. వాటిలో హిట్ సినిమాలు కూడా ఉన్నాయని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ హిట్ సినిమాలు కృతి శెట్టి ఖాతాలో ప‌డి ఉండే.. ఆమె రేంజ్ ఇప్పుడు మ‌రో స్థాయిలో ఉండేద‌ని ఇన్‌సైడ్ టాక్‌.