యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైడెడ్ చిత్రంగా పేరుపొందింది ఆది పురుష్.. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి ఇప్పటికి కొన్ని నెలలు కావస్తున్న ఈ సినిమా VFX కారణంగా కాస్త ఆలస్యం అవుతోంది .ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హీరోయిన్గా కృతి సనన్ నటిస్తోంది. అలాగే సైఫ్ అలీ ఖాన్ కూడా నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడు పాత్రలో కనిపించబోతున్నారు ఈ సినిమా కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ప్రభాస్కు బాహుబలి తర్వాత సరైన సక్సెస్ అందుకోలేక సతమతమవుతున్నారు.
గతంలో ఆది పురుష్ సినిమా టీజర్ ని ప్రేక్షకుల ముందుకు విడుదల చేయగా దీంతో ఎన్నో విమర్శలు ఎదుర్కోవడంతోపాటు పలు రకాలుగా ట్రోలింగ్ కూడా జరుగుతోంది. దీంతో ఈ సినిమా పైన నెలకొన్న క్రేజ్ కారణంగా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో చిత్రీకరించారు చిత్రబృందం.అయితే ఈ సినిమాకు సంబంధించి ఓవర్సీస్ బిజినెస్ గత కొంతకాలంగా జరగలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ ఓవర్సీస్ లో ఎవరు విడుదల చేస్తారు అనే విషయంపై క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఆది పురుష్ ఓవర్సీస్ రైట్స్ ను ప్రముఖ సంస్థ AA ఫిలిమ్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.దీన్ని భారీ ధరకే కొనుగోలు చేసినట్లుగా సమాచారం. ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఏ మేరకు ఈ సినిమా అభిమానులను ఆనందపరుస్తుందో చూడాలి మరి.