పెళ్లి త‌ర్వాత కూడా కుర్రాళ్ల‌కు కునుకు లేకుండా చేస్తున్న కియారా.. తాజా పిక్స్ చూస్తే చెమ‌ట‌లే!

బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఈ అమ్మడు మహేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన బ్లాక్ బస్టర్ హిట్ `భరత్ అనే నేను` మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

ఆ తర్వాత రామ్ చరణ్ తో `వినయ విధేయ రామ`లో మెరిసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో బ్యాక్‌ టు బ్యాక్ చిత్రాలు చేస్తూ క్షణం తీరక లేకుండా కడుపుతోంది.

ఇక చాలాకాలం తర్వాత తెలుగులో ఓ సినిమాకు సైన్ చేసింది. అదే `గేమ్ ఛేంజర్`. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ శంకర్‌ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది.

ఇక‌పోతే కొద్ది రోజుల క్రితం కియారా పెళ్లి పీట‌లెక్కిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో గత కొన్నేళ్ల నుంచి ప్రేమాయణం నడిపిస్తున్న కియర్.. ఫైనల్ గా అతడితో ఏడడుగులు వేసింది.

అయితే పెళ్లి తర్వాత కూడా గ్లామర్ షో విషయంలో తగ్గేదేలే అంటుంది. తరచూ హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రాళ్ల‌కు కునుకు లేకుండా చేస్తుంది.

తాజాగా మరోసారి తన అందాలతో వేడి పెంచేసింది. రెడ్ కలర్ డ్రెస్ లో అందాలన్నీ బయటపెట్టి చెమటలు పట్టించింది. ప్రస్తుతం కియారా తాజా పిక్స్ నెట్టింట ఓ రేంజ్ లో దుమారం రేపుతున్నాయి.

Share post:

Latest