బలగం మూవీ హీరోయిన్ హాట్ పిక్స్ వైరల్.. చూస్తే తట్టుకోలేరు..

కావ్య కళ్యాణ్ రామ్ మసూద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయం అయింది. ఈ ముద్దుగుమ్మ మాట కాస్త హస్కీగా ఉంటుంది. ఇక ఈ తార ముఖ సౌందర్యానికి ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే. మళ్లీ మళ్లీ చూడాలనిపించే అందం ఈమె సొంతం. బలగం సినిమాలో హీరోయిన్‌గా ఈ ముద్దుగుమ్మ నటించింది. ఇందులో ఈ తార లుక్స్ చాలా బాగున్నాయి. ప్రియదర్శినితో ఆమె మధ్య జరిగిన సన్నివేశాలు కూడా అందరి హృదయాలను దోచేశాయి. ఈ రెండు సినిమాలతో ఆమె తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.

మసూద సినిమాలో కావ్య రోల్‌కి ఎక్కువ స్క్రీన్ టైమ్ లేదు కానీ బలగంలో మాత్రం ఈ ముద్దుగుమ్మకు ఫుల్ లెన్త్ రోల్‌ దొరికింది. బలగం ఎంతగా హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దీనితో కావ్య ఒక్కసారిగా స్టార్‌డమ్‌ సొంతం చేసుకుంది. బలగం మూవీలో ప్రతి పాత్ర ముఖ్యమైనదే. అలాగే ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయేదే. కావ్య పోషించిన సంధ్య పాత్ర కూడా ఎమోషనల్, రొమాంటిక్, కామెడీ టచ్‌తో అందరినీ బాగా అలరించింది.

బలగం మూవీతో తన ఫేట్ మారిపోతుందని కావ్య భావిస్తుంది. మరి ఈ అమ్మడుకు ఎన్ని అవకాశాలు వస్తాయో చూడాలి. ఇంతలో ఈ తార సోషల్ మీడియా వేదికగా తన అందాలను ఆరబోస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. ఈ అమ్మడి అందాలకు తెలుగు వారు ఫిదా అవుతున్నారు. స్మాల్ సినిమాలతో పాటు మీడియం సినిమాలలో కావ్య కి కచ్చితంగా అవకాశాలు క్యూ కట్టే ఛాన్సెస్ ఎక్కువ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇకపోతే పక్కా హైదరాబాదీ అమ్మాయి అయిన కావ్య మొదటగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అడుగుపెట్టింది. బన్నీ హీరోగా నటించిన గంగోత్రి సినిమాలో కావ్య యంగ్ గంగోత్రిగా కనిపించింది. ఈ సినిమాలో పెద్ద గంగోత్రిగా ఆర్తి అగర్వాల్ చెల్లి అదితి అగర్వాల్ యాక్ట్ చేసింది. పవన్ కళ్యాణ్-శ్రియ కాంబోలో వచ్చిన బాలులో కూడా కావ్య బాలనటిగా కనిపించి అలరించింది.