`రావ‌ణాసుర‌`కు పెద్ద దెబ్బ‌.. రెండో రోజుకే భారీగా ప‌డిపోయిన వ‌సూళ్లు!

మాస్ మ‌హారాజా ర‌వితేజ తాజాగా `రావ‌ణాసుర‌` అనే క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్‌టీ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్ల పై అభిషేక్‌ నామా, శ్రీకాంత్ విస్సా నిర్మిస్తున్నారు.

అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ ఇందులో హీరోయిన్లుగా న‌టించారు. ఏప్రిల్ 7న భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ ల‌భించింది. అయిన‌ప్ప‌టికీ మంచి ఓపెనింగ్స్ రాబ‌ట్టిన ఈ చిత్రానికి రెండో రోజు మాత్రం పెద్ద దెబ్బ ప‌డింది. భారీగా వ‌సూళ్లు ప‌డిపోయాయి.

తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు రూ. 4.29 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం.. రూ. 2.25 కోట్ల రేంజ్ లో షేర్ తోనే సరిపెట్టుకుంది. వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 2.85 కోట్ల షేర్ ని సాధించింది. ఇక ఏరియాల వారీగా రావ‌ణాసుర 2 డేస్ టోట‌ల్ కలెక్ష‌న్స్ ను ఓ సారి గ‌మనిస్తే..

నైజాం: 2.53 కోట్లు
సీడెడ్: 1.12 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 97 ల‌క్ష‌లు
తూర్పు: 49 ల‌క్ష‌లు
పశ్చిమ: 32 ల‌క్ష‌లు
గుంటూరు: 57 ల‌క్ష‌లు
కృష్ణ: 32 ల‌క్ష‌లు
నెల్లూరు: 22 ల‌క్ష‌లు
—————————————–
ఏపీ+తెలంగాణ‌= 6.54 కోట్లు(10.75 కోట్లు~ గ్రాస్)
—————————————–

కర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా – 0.56 కోట్లు
ఓవ‌ర్సీస్‌- 0.70 కోట్లు
——————————————–
టోటల్ వరల్డ్ వైడ్ – 7.80 కోట్లు(13.70 కోట్లు~ గ్రాస్)
——————————————–

కాగా, బాక్స్ ఆఫీస్ దగ్గర రూ. 22.2 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం.. రూ. 23 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అంటే బాక్సాఫీస్ వ‌ద్ద ఈ చిత్రం క్లీన్ హిట్ గా నిల‌వాలంటే.. మొద‌టి రెండు రోజులు వ‌చ్చిన వ‌సూళ్లు కాకుండా ఇంకా రూ. 15.20 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాలి.