“ఆయన కాదు ..సమంత అన్ స్టాపబుల్”.. బాలయ్య అభిమానులని ఫింగర్ పెట్టి కెలికిన స్టార్ హీరోయిన్..!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత లేటెస్ట్ గా నటించిన చిత్రం శాకుంతలం. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14న థియేటర్స్ లో రిలీజ్ అయిన డిజాస్టర్ టాక్ అందుకుంది . మరీ ముఖ్యంగా కలెక్షన్స్ పరంగా కూడా సమంత కెరియర్ లోనే పరమ చెత్త రికార్డులను అందుకుంది.

ఈ క్రమంలోని సమంత పేరును ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలో . అయితే అలాంటి వాళ్లకు గట్టిగా ఇచ్చి పడేసింది స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ . రీసెంట్ గా కీర్తి సురేష్ నటించిన దసరా సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . ఈ క్రమంలోనే రీసెంట్గా అభిమానులతో ముచుట్టించిన కీర్తి సురేష్ కు సమంతా గురించి ఓ ప్రశ్న ఎదురైంది .

ఈ క్రమంలోనే కీర్తి సురేష్ – సమంత గురించి మాట్లాడుతూ ..”ఆమె ఓ ప్రేరణ కలిగించే వ్యక్తి . ఆమెకు గుండె ధైర్యం ఎక్కువ.. ఒకరకంగా చెప్పాలంటే సమంత అన్ స్టాపబుల్ ” అంటూ ఒక్క ముక్కలు కీర్తి సురేష్ సమంత పై ఉన్న ఒపీనియన్ చెప్పేసింది . ఈ క్రమంలోనే ఈ కామెంట్స్ కి సమంత థాంక్యూ డియర్ అంటూ రిప్లై ఇవ్వడం విశేషం . ఈ క్రమంలోనే బాలయ్య ఫ్యాన్స్ మండిపడుతున్నారు . ఆన్ స్టాపబుల్ ట్యాగ్ మా బాలయ్యది ఆమెకి ఎందుకు ఇస్తున్నావ్ అంటూ కీర్తి సురేష్ పై మండిపడుతున్నారు..!!