మన సుధీర్ గాడికి పెళ్లి కుదిరిపోయిందోచ్..అబ్బబ్బా ..ఏం షాక్ ఇచ్చావ్ రా మావ..!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జబర్దస్త్ కమెడియన్గా స్టార్ పొజిషన్ అందుకున్న సుడిగాలి సుధీర్ పెళ్లి కుదిరిందా ..? అంటే అవునని అంటున్నారు సినీ వర్గాలు . ఇన్నాళ్లు సుడిగాలి సుధీర్ బుల్లితెరకు దూరం కాబోతున్నాడు అని .. ఆయన కెరియర్ క్లోజ్ అయిపోయిందని .. జబర్దస్త్ ఇచ్చిన క్రేజ్ ను ఉపయోగించుకొని జబర్దస్త్ కే వెన్నుపోటు పొడిచారని ..నానా రకాలుగా సోషల్ మీడియాలో ఆయనని ట్రోల్ చేశారు.

అంతేకాదు ఆయన జాన్ జిగిడి దోస్తులైన రాంబాబు – శ్రీను తో కూడా స్నేహబంధం కటీఫ్ చేసుకున్నాడు అంటూ రకరకాలుగా మాటలు మాట్లాడారు జనాలు. అయితే అవంతా ఫేక్ అంటూ చెప్పకనే చెప్పేసాడు సుధీర్. కాగా రీసెంట్ గా జబర్దస్త్ లో స్టార్ పొజిషన్ అందుకున్న సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

అంతేకాదు ఆయన పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు తన సొంత మరదల్ని అంటూ కూడా ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది . ఇన్నాళ్లు యాంకర్ రష్మీతో లవ్ ట్రాక్ నడిపాడు అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన బంధువులు చెప్పుకొస్తున్నారు. ఆయన ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయాడు అన్న సంగతి ఓపెన్ గా చెప్పుకొచ్చాడు సుధీర్. అంతేకాదు తన ఇంట్లో పెద్దలు కుదిరిచిన సంబంధాన్ని చేసుకొని వాళ్ళని హ్యాపీగా చూసుకోవడానికి సుధీర్ ఇష్టపడుతున్నారట . ఈ క్రమంలోనే తన సొంత మరదలుతో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో ఆయన అభిమానులు సర్ ప్రైజింగ్ కామెంట్స్ పెడుతుంటే ..మరి కొందరు రష్మీ ఏమైపోవాలో పాపం అంటూ దీనంగా కామెంట్స్ చేస్తున్నారు . దీంతో మరోసారి సోషల్ మీడియాలో సుడిగాలి సుధీర్ పేరు మారుమ్రోగిపోతుంది..!!