డ‌బ్బు కోసం అలాంటి చెత్త ప‌నికి ఒప్పుకున్న కాజ‌ల్‌.. త‌ప్పు చేస్తుందా?

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తుండంగానే ఓ ఇంటివి అయిపోయింది. ముంబైలో స్థిర‌ప‌డ్డ వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూతో ఏడ‌డుగులు వేసింది. వివాహం త‌ర్వాత పెద్ద‌గా గ్యాప్ తీసుకోకుండా ఓ బిడ్డ‌కు త‌ల్లి కూడా అయింది. అంతేనా.. బిడ్డ పుట్టిన ఆరు నెల‌ల‌కే సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. ప్ర‌స్తుతం చేతి నిండా ప్రాజెక్ట్ ల‌తో బిజీగా మారింది. కాజ‌ల్ చేస్తున్న చిత్రాల్లో `ఇండియ‌న్ 2` ఒక‌టి.

శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో లోకనాయకుడు కమల్‌ హాసన్ హీరోగా న‌టిస్తున్నాడు. కాల‌జ్ అగ‌ర్వాల్, ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అమెరికాలోని జోహన్సన్‌బర్గ్ లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ లు చిత్రీకరించబోతున్నారట. అయితే ఈ సినిమాలో కాజ‌ల్ బికినీ షో చేయ‌బోతోంద‌ని తాజాగా ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. కమల్ హాసన్ తో కొన్ని రొమాంటిక్ సీన్స్ లో భాగంగా కాజల్ బికినీ వేయాల్సి ఉంటుంద‌ట‌.

అయితే మొద‌ట బిజినీ వేసేందుకు కాజ‌ల్ ఒప్పుకోలేద‌ట‌. దాంతో మేక‌ర్స్ రెమ్యున‌రేష‌న్ పెంచుతామ‌ని చెప్ప‌డంతో.. కాజ‌ల్ బికినీ షోకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌. బికినీ సన్నివేశాలు కాజల్ కి కొత్తేంకాదు. గతంలో పలు సినిమాల్లో బికినీలో ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. అలాగే వ్యక్తిగత ఫోటో షూట్ల కోసం, వెకేషన్ స్పాట్ లో కూడా బికినీ వేసింది. కానీ, ఇప్పుడు కాజ‌ల్ ఒక బిడ్డ‌కు త‌ల్లి అయింది. ఈ నేప‌థ్యంలోనే ఆమె బికినీ వేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. కొంద‌రు నెటిజ‌న్లు ఈ విష‌యంలో కాజ‌ల్ ను దారుణంగా త‌ప్పుబ‌డుతున్నారు. త‌ల్లి అయిన త‌ర్వాత డ‌బ్బు కోసం అలాంటి చెత్త ప‌నికి ఒప్పుకుంటావా అంటూ మండి ప‌డుతున్నారు.