విలన్‌గా ఎన్టీఆర్.. చెడ్డవాడు అన్యాయంపై చేసే యుద్ధం ఎంతో గొప్పది..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత చాలా సమయం తీసుకుని కొరటాల శివతో తన తర్వాత సినిమాను మొదలు పెట్టాడు. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా ఈ మూవీపై భారీ అంచనాలను పెంచేస్తుంది. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ ఎంతో శ‌ర‌వేగంగా జరుగుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాలో విలన్ ఇతనేనంటూ వేర్వేరు పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి.

NTR 30: Why such a huge gap for the second schedule..? Crazy news for NTR fans This is the reason for long break to second schedule of NTR 30 Koratala Siva Telugu

అయితే ఇప్పుడు ఈ సినిమాలో అతిపెద్ద విలన్ ఎన్టీఆర్ అనే తెలుస్తుంది. ఈ సినిమాలో అందరికంటే క్రూరమైన వ్యక్తిలా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడని.. ఇక తారక్ అన్యాయంపై చేసే యుద్ధమే ఎంతో గ్రేట్ అనే కథాంశంతో ఈ మూవీ రాబోతుందని తెలుస్తుంది. కేజీఎఫ్ సినిమాలో యాష్ క్యారెక్టర్ లా ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్ ఉండబోతుందని తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉండగా అందులో ఒక పాత్రకు బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా కృతి శెట్టి పేరును పరిశీలిస్తున్నారని తెలుస్తుంది.

NTR 30: Janhvi Kapoor's new Tollywood movie will launch soon; all details about the movie - TechnoSports Media Group

వచ్చేనెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు పలు వేరువేరు టైటిల్స్ ను పరిశీలిస్తుండగా కొరటాల ఈ సినిమాకు ఓ పవర్ ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ తరవాత ఎన్టీఆర్- కొరటాల కాంబోలో వస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే. ఇక మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.

NTR 30: Koratala Siva is thinking about the title. | Koratala siva thinking on single liner title for Jr NTR 30 project

వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా రిలీజ్ కానుండగా ఎంతో ప్లానింగ్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్30 సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని బోగట్టా. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో స్పెషల్ అనే విధంగా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. జై లవకుశ సినిమాలో జై రోల్ ను మరిపించేలా ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్ ఉంటుందని సమాచారం.