తాడిపత్రి సీటు మళ్ళీ జేసీ తనయుడుకే..లోకేష్ క్లారిటీ?

వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసే అభర్ధులపై ఇప్పుడుప్పుడే క్లారిటీ వస్తుంది. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా సరే గతానికి భిన్నంగా చంద్రబాబు సీట్లు ఫిక్స్ చేసుకుంటూ వెళుతున్న విషయం తెలిసిందే. నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఈ సారి మొహమాటం పడకుండా..పనిచేయని వారికి సీట్లు లేవని చెప్పేస్తున్నారు. ఇక బలమైన అభ్యర్ధులకు సీట్లు ఖరారు చేసేస్తున్నారు.

ఇదే క్రమంలో పాదయాత్రతో ముందుకెళుతున్న లోకేష్..పలు నియోజకవర్గాల్లో అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వచ్చిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ప్రస్తుతం ఆయన తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇక అక్కడ నెక్స్ట్ జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి మళ్ళీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోకేష్ పాదయాత్రలో జేసీ ఫ్యామిలీ పాల్గొన్న విషయం తెలిసిందే. లోకేశ్ పాదయాత్ర పూర్తి గా విజయవంతం అయ్యేలా చేశారు. ప్రజలు భారీ ఎత్తున వచ్చారు.

ఇక ఇక్కడ నెక్స్ట్ టి‌డి‌పి గెలుపు ఖాయమనే చెప్పవచ్చు. మామూలుగా తాడిపత్రి జేసీ ఫ్యామిలీ కంచుకోట..అక్కడ ఓటమి ఎరగకుండా రాజకీయం చేస్తున్నారు. కానీ గత ఎన్నికల్లో తాడిపత్రి నుంచి జే‌సి ప్రభాకర్ రెడ్డి తనయుడు పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మళ్ళీ జే‌సి ప్రభాకర్ ఎంట్రీ ఇచ్చి..తాడిపత్రిలో పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే తాడిపత్రి మున్సిపాలిటీని కైవసం చేసుకుని…మున్సిపల్ ఛైర్మన్ అయ్యారు. అలా అక్కడ పార్టీని బలోపేతం చేశారు.

ఇక నెక్స్ట్ ఎన్నికల్లో ప్రభాకర్ పోటీ చేసే అవకాశాలు లేవు..ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి మళ్ళీ పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. గత ఎన్నికల్లో అంటే వైసీపీ గాలిలో వల్ల ఓటమి పాలయ్యారు. కానీ ఈ సారి మాత్రం గెలుపు అవకాశాలు ఉన్నాయి..దీంతో అస్మిత్ పోటీ చేయడం ఫిక్స్ అని చెప్పవచ్చు.