it’s Official: పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న గోవా బ్యూటీ.. అభిమానులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఇలియానా..!!

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అంటే ఇదే కాబోలు . లేకపోతే పెళ్లి లేదు .. డేటింగ్ లేదు.. ఆ ఊసే లేకుండా ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేస్తే సోషల్ మీడియాలో జనాలు ఏకి పారేయరా..? ట్రోల్ చేసి నానా విధాలుగా డౌన్ చేయరా..? ఎస్ ప్రెసెంట్ ఇలాంటి కామెంట్స్ తోనే హీరోయిన్ ఇలియానా పై జనాలు రెచ్చిపోయి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. మనకు తెలిసిందే గోవా బ్యూటీగా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో దేవదాసు అనే సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమైంది. ఆ తర్వాత ఇండస్ట్రీలో హిట్లు ప్లాపులు తేడా లేకుండా వరుస సినిమాలకు కమిట్ అయ్యి సోషల్ మీడియాని సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన ఇలియానా .. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి చెక్కేసింది.


ఏం ముహుర్తాన బాలీవుడ్ లోకి అడుగుపెట్టిందో తెలియదు కానీ ..అప్పటి నుంచి ఇలియానా టైం డిజాస్టర్ గా మారిపోయింది . పట్టిందల్లా నెగటివ్ గానే అయిపోతుంది . ఏ సినిమా హిట్ అవ్వలేదు తెలుగులో అవకాశాలు రావడమే కరువయ్యాయి . ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ లోనే అరాకొరా అవకాశాలతో నెట్టుకొస్తున్న ఇలియానా కొద్దిసేపటి క్రితమే తన ప్రెగ్నెన్సీ పై అఫీషియల్ ప్రకటన ఇచ్చింది .

ఎస్ వినడానికి విడ్డూరంగా ఉన్న.. ఆశ్చర్యకరంగా ఉన్న ఇదే నిజం ..ఇలియానా తల్లి కాబోతుంది. ఇదే విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఓ బేబీ షర్ట్ ఫోటోని పోస్ట్ చేస్తూ పక్కనే మమ్మ అనే లాకెట్ ను ఆడ్ చేసింది. అంతేకాదు ఇంస్టాగ్రామ్ లో స్పెషల్ నోట్ కూడా రాసుకొచ్చింది . “నా చిన్ని బేబీని చూడడానికి ఆగలేకపోతున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఇలియానా ప్రెగ్నెన్సీ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది .

ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలలో బాలీవుడ్ ఇండస్ట్రీలలో ఇలియానా ప్రెగ్నెన్సీ న్యూస్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అసలు ఇలియానా కడుపులో ఉన్న బిడ్డ కు తండ్రి ఎవరు..? అసలు ఎవరితో డేటింగ్ చేస్తుంది..? లేకపోతే ఇలియానా ఎవరైనా బిడ్డను దత్తత తీసుకుంటుందా? లేకపోతే తమ రిలేటివ్స్ బిడ్డలను పరిచయం చేయబోతూ.. ఇలియానా ఇలాంటి కామెంట్ పెట్టిందా..? ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో ఆమెను ప్రశ్నిస్తున్నారు అభిమానులు . చూడాలి మరి దీనిపై ఇలియానా ఏ విధంగా స్పందిస్తుందో..?

 

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)