ఆ విషయంలో భార్య కోరిక తీర్చ‌లేని ఎన్టీఆర్ ఇప్ప‌ట‌కి బాధ‌ప‌డుతున్నాడా ?

నందమూరి ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. అయితే ఈయన కెరీర్ మొదటిలో నందమూరి కుటుంబం అంతగా పట్టించుకోలేదు. కానీ తారక్ తన సినిమాలతో నందమూరి ఫ్యామిలీ గౌరవాన్ని మరింత పెంచాడు. అయితే ఇంత చేసినా నందమూరి ఫ్యామిలీ కొన్ని సందర్భాలలో ఎన్టీఆర్‌ను చాలా అవమానించారని ఇప్ప‌టికి ఎన్టీఆర్ అభిమానులు చెబుతూ ఉంటారు.

ఎన్టీఆర్‌కీ సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ తన సొంత టాలెంట్‌తో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా గుర్తుకు తెచ్చుకున్నాడు. అప్పటినుంచి నందమూరి కుటుంబం కూడా ఆయనకు దగ్గర అయింది. ఇక గత సంవత్సరం త్రిబుల్ ఆర్ సినిమాతో ఆల్ ఇండియా స్థాయిలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించి. ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా వరుస‌ సినిమాలలో నటిస్తున్నాడు.

ఇప్ప‌టికే త‌న 30వ సిమాను ఎన్టీఆర్- కొరటాల శివ డైరెక్షన్లో చేస్తున్నాడు. ఇక రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే. ఎన్టీఆర్- లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకున్నాడు. ఇక ఎన్టీఆర్ వైఫ్ ప్రణతి ఏ ఫంక్షన్ లో కనిపించిన అచ్చ తెలుగు అమ్మాయిల చీర కట్టుకుని చాలా అందంగా కనిపిస్తుంది.

Rs 3,57,000- Jr NTR's wife Lakshmi Pranathi styles her winter look in Japan with Louis Vuitton bag | PINKVILLA

జూనియర్ ఎన్టీఆర్‌కి ఇద్దరు కొడుకులు ఉన్న సంగతి మనకు తెలిసిందే. కానీ మొదటి కొడుకు పుట్టినప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నా ఎన్టీఆర్ తర్వాత కూతురు పుడుతుంది అని భావించాడట. కానీ రెండోసారి కూడా కొడుకే పుట్టేసరికి ఎన్టీఆర్ కాస్త ఫీలైనట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంతేకాదు ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతికి అమ్మాయిలు అంటే చాలా ఇష్టమట.

Lakshmi Pranathi: ఫస్ట్ ట్వీట్ నా లవ్లీ భర్తతో అంటూ.. తారక్ వైఫ్ ప్రణతి సోషల్ మీడియాలో అడుగు .. ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కం | Jr NTr wife lakshmi pranathi opens her official ...

ఇక రెండోసారి తమకు ఆడపిల్ల పుడుతుందని ఆశగా ఎదురు చూసినప్పటికీ కొడుకు పుట్టడంతో ఆ విషయంలో కాస్త హర్ట్ అయ్యారని తెలుస్తుంది. లక్ష్మీ ప్రణతి ప్రతిసారి మన ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంటే బాగుంటుంది కదా అని జూనియర్ ఎన్టీఆర్‌ని అడిగేదట. ఇక ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్- లక్ష్మీ ప్రణతి కోరిక తీర్చనందుకు ఇప్పటికీ బాధపడుతున్నాడట.