పెళ్లయి తలైనా తగ్గని నయనతార అందం.. లేటెస్ట్ పిక్స్ చూస్తే ఆపుకోలేరు!

ప్రముఖ నటి నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అందం, టాలెంట్ ఉన్న అతి తక్కువ మంది హీరోయిన్లలో నయనతార కూడా ఒకరు. ఈ అమ్మడు ఎక్కువగా తెలుగు, తమిళ భాషలో నటించి మంచి క్రేజ్‌ని సంపాదించుకుంటుంది. నయనతార టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరి సరసన నటించి హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ స్టార్ హీరోయిన్స్‌లో ఒకరిగా తన కెరీర్‌ని కొనసాగించింది.

ఈ అమ్మడు టాలీవుడ్‌లో చివరిగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఇక ఆ తరువాత తెలుగులో కనిపించలేదు. ఎందుకంటే ప్రస్తుతం ఆమె దృష్టి మొత్తం తమిళ్ ఇండస్ట్రీ పైనే పెట్టింది. దాంట్లో భాగంగానే వరుస తమిళ్ సినిమాలో నటిస్తూ అక్కడ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటుంది. తమిళ్ ఇండస్ట్రీలో హ్యాపీగా తన కెరీర్‌ని ముందుకు కొనసాగిస్తుంది. తాజాగా నయనతార ‘బీహైండ్‌ వుడ్స్ గోల్డ్ ఐకాన్’ అవార్డ్స్ ఫంక్షన్‌కి హాజరైంది.

ఆ కార్యక్రమానికి నయనతార వైట్ కలర్ శారీ కట్టుకొని, స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకొని హాజరైంది. ఆ శారీ కోసం కాంబినేషన్‌గా మేడలో ఒక సింపుల్ లకెట్ వేసుకుంది. ఆ వైట్ శారీలో నయనతార చాలా బ్యూటీఫుల్‌గా కనపడుతుంది. పెళ్లి అయ్యి ఇద్దరు కవల పిల్లలకు తల్లీ అయినా నయనతార అందం ఏ మాత్రం చెక్కు చెదరలేదు. ఏ అవార్డ్స్ ఫంక్షన్స్ లో నయనతార సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా మారింది. ప్రస్తుతం ఈ అవార్డ్స్ ఫంక్షన్ లోని నయనతార ఫొటోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.