త్రిష అంత మందితో ప్రమాణం నడిపిందా.. చివరికి ఆ హీరోతో కూడా..!

సౌత్ స్టార్ హీరోయిన్స్ లో త్రిష కూడా ఒకరు. త‌న అందం అభినయంతో త్రిష ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్ లోని స్టార్ హీరోలు అందరి తో సినిమాలు చేసింది. త్రిష కెరీర్ మొద‌టిలో సైడ్ క్యారెక్టర్ లు సైతం చేసింది. ఇక 2002 లో మొదటిసారిగా మౌనం పసియాదే సినిమాలో లీడ్ రోల్ లో నటించి అలరించింది. ఆ తరవాత తెలుగుతో పాటు హిందీ లో కూడా సినిమాలు చేసింది. చూడ్డానికి పక్కింటి అమ్మాయిలా కనిపించే త్రిషకు తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో అభిమానులు ఎక్కువ అయ్యారు. త్రిష కేవలం హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో సైతం నటించి తన నటనతో ప్రశంసలు అందుకుంది.

Trisha Krishnan's Alleged Relationships, Broken Engagement, Expensive Cars,  Luxurious Home And More

ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సీనియర్ హీరోల నుంచి ఆఫర్ల‌ను అందుకుంటోంది. చివరగా త్రిష PS-1 సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకుంది. ఈ సినిమాలో త్రిష నటన కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే త్రిష ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో పాటూ కాంట్రవర్సీ లతో కూడా హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా ఎంతో మంది హీరోల‌తో త్రిష లవ్ ఎఫైర్ లు నడిపించింది అని కూడా ఇండస్ట్రీ లో టాక్ ఉంది. ప్రముఖ వ్యాపార వేత్త వరుణ్ మనియన్‌తో త్రిష లవ్ ట్రాక్ నడిపించింది. వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ ఆ తరవాత ఏం జరిగిందో ఏమో గానీ వీరిద్దరూ విడిపోయారు.

అంతే కాకుండా వరుణ్ తో విడిపోయిన రెండు నెలలకే త్రిష హీరో రానాతో ప్రేమాయణం నడిపింది అంటూ టాలీవుడ్ లో వార్తలు గుప్పుమన్నాయి. వీరిద్దరూ అప్పట్లో పార్టీలకు కూడా కలిసి వెళ్లారు. కరణ్ జోహార్ షోలో రానా కూడా త్రిష గురించి చెప్పాడు. త్రిష మంచి ఫ్రెండ్ అని చాలా కాలం ఫ్రెండ్స్ గా ఉన్న తాము కొంతకాలం డేటింగ్ చేశామని చెప్పాడు. కానీ కొన్ని జరగవు అంతే అంటూ సమాధానం ఇచ్చాడు. అయితే కొంతకాలానికి ఇద్దరూ విడిపోయి ఎవరి దారి వాళ్ళు చుస్కున్నారు. అంతే కాకుండా త్రిష మొదటి సారిగా తమిళ స్టార్ హీరో విజయ్ తో లవ్ ట్రాక్ నడిపింది అంటూ కోలీవుడ్ లో వార్తలు వచ్చాయి.

Rana opens up about his break-up with Trisha - Tamil News - IndiaGlitz.com

విజయ్‌తో కలిసి త్రిష గిల్లి అనే సినిమాలో నటించింది. ఈ సినిమా సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది అని ఆ తరవాత ఏవో కారణాల విడిపోయారు అని టాక్ ఉంది. కోలీవుడ్ లో రియల్ లైఫ్ లవ్ బాయ్ గా పేరున్న ధనుష్ కూడా త్రిష తో లవ్ ఎఫైర్ నడిపించాడు అనే టాక్ ఉంది. అంతే కాకుండా వరుణ్ కు ధనుష్ కు ఓ సినిమా విషయం లో మనస్పర్ధలు ఉన్నాయట. కానీ త్రిష మాత్రం ధనుష్ ను ఎంగేజ్మెంట్ కు పిలువగా అతడు హాజరయ్యాడు.

దాంతో వరుణ్ – త్రిష ఎంగేజ్మెంట్ పార్టీ తరవాత ఈ విషయం పై గొడవ కూడా పెట్టుకున్నారట. అలా చివ‌ర‌కు ఇగోలో పెద్దవి కావ‌డంతో త్రిష – వ‌రుణ్ ఎంగేజ్మెంట్ కూడా బ్రేక‌ప్ అయ్యింది. ఇదిలా ఉంటే ఇలా చాలా మందితో ప్రేమాయణాలు నడిపించిన త్రిష ప్రస్తుతం సింగిల్ గానే ఉంటోంది. మరి ఈ అమ్మడు బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో చూడాలి