పోలా అద్దిరిపోలా..అలాంటి వాళ్ల నోర్లు ఖతక్ అని మూయించిన పూర్ణ.. అదృష్టం అంటే ఇదేగా..!!

పూర్ణ .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ పేరుకి మలయాళ బ్యూటీ అయిన అచ్చం తెలుగింటి అమ్మాయిల ఉంటుంది . చీర కట్టి నిండుగా బొట్టు పెట్టి .. చేతినిండా గాజులు వేసి తలలో మల్లెపూలు పెడితే ఎవరైనా సరే ఈ అమ్మడును చూసి తెలుగింటి ముద్దుగుమ్మ అనుకోవాల్సిందే . అంతలా చూడ చక్కగా ఉంటుంది . అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టక ఎలాంటి రోల్స్ నైనా చేయగలగాలి అంటూ క్లాస్ మాస్ అనే తేడా లేకుండా తనదైన స్టైల్ లో నటించి మెప్పించిన పూర్ణ రీసెంట్ గానే దసరా సినిమాలో ఇంపార్టెంట్ పాత్రలో మెరిసి జనాలను మెప్పించింది.

కాగా పూర్ణ దుబాయ్ కి చెందిన బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గుట్టు చప్పుడు కాకుండా సైలెంట్ గా పెళ్లి చేసుకున్న పూర్ణ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని మాత్రం హంగామా చేస్తూ అనౌన్స్ చేసింది . అంతేకాదు పెళ్లయిన కొన్ని నెలలకి తల్లి కాబోతున్నానంటూ గుడ్ న్యూస్ చెప్పిన పూర్ణ రీసెంట్గా పండు లాంటి బాబుకు జన్మనిచ్చి తల్లి అయిన ఫీలింగ్ ని ఎంజాయ్ చేస్తుంది. కాగా ఆమెకు డెలివరీ జరిగే కొద్ది రోజుల ముందే దసరా సినిమాలోని పాటకు డాన్స్ చేస్తూ సోషల్ మీడియా లో ట్రోలింగ్ కి గురైంది.

నిండు గర్భిణీ ఇలాంటి టైంలో డాన్స్ అవసరమా ..? బిడ్డకు ఏదైనా జరిగితే.. ఆ మాత్రం సెన్స్ లేదా అంటూ ట్రోల్ చేశారు . అయితే అలాంటి వాళ్ళ నోర్లు మూయిస్తూ హెల్తీగా బేబీకి జన్మనిచ్చింది పూర్ణ . సోమవారం రాత్రి దుబాయ్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చింది పూర్ణ. బెడ్ పై బాబుని ఎత్తుకొని హాస్పిటల్ సిబ్బందితో తన భర్తతో దిగిన ఫొటోస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది . ఈ క్రమంలోనే తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు . ప్రజెంట్ పూర్ణ బేబీ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..!!