బాలయ్య బాబు తప్పు చేస్తున్నాడా..? ఎక్కడో తెడా కొడుతుందే..? సింక్ అవ్వట్లేదే..?

జనరల్గా సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరో సినిమా వస్తుంది అన్న ..సీనియర్ హీరో సినిమా షూట్ స్టార్ట్ అయింది అన్న.. సోషల్ మీడియాలో.. న్యూస్ ఛానల్లో నాన్న హంగామా నడుస్తూ ఉంటాది. ఇప్పటివరకు మనం చూసుకున్న ట్రాక్ రికార్డ్ ప్రకారం అదే విధంగా కొనసాగుతూ వస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి ,అక్కినేని నాగార్జున, నందమూరి బాలయ్య, విక్టరీ వెంకటేష్ ,మహేష్ బాబు ,ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతోమంది హీరోలు సినిమాలు స్టార్ట్ అయినప్పటి నుంచి .. ఆ సినిమా రిలీజ్ అయి ..హిట్ కొట్టే వరకు ..ఫ్యాన్స్ హంగామా చేస్తూ ఉంటారు.

అయితే ఎందుకో తెలియదు కానీ అనిల్ రావిపూడి డైరెక్షన్లో బాలయ్య నటిస్తున్న సినిమా విషయంలో మాత్రం ఫ్యాన్స్ ఫుల్ ఫిల్ గా లేరు అన్న టాక్ ఎక్కువగా వినపడుతుంది . దానికి మెయిన్ రీజన్ అఖండ సినిమాకి , వీరసింహారెడ్డి సినిమాకి వచ్చిన అంత బజ్ ఎన్బికె 108 సినిమాకి రాకపోవడమే కారణం అంటూ తెలుస్తుంది . ఈ సినిమాలో కాజల్ నటించబోతుంది. శ్రీలీల కూడా నటించబోతుంది.. బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించబోతున్నాడు.. అయినా కానీ సినిమాకి ఎందుకు సరైన బజ్ ఏర్పడడం లేదు ..?

ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి డైరెక్షన్ పై ఎక్కడో నందమూరి ఫ్యాన్స్ కు తేడా కొడుతుంది. సినిమాలో తీసుకున్న హీరోయిన్స్ బ్యాక్ గ్రౌండ్ ప్రకారం .. రిలీజ్ చేసిన్ లుక్స్ ప్రకారం ఎక్కడ సింక్ అవ్వట్లేదు అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు . బాలయ్య లాంటి మాస్ హీరోకి అంతకుమించిన డబుల్ రేంజ్ లో ఉండే మాస్ పర్ఫామెన్స్ఇచ్చే హీరోయిన్స్ అయితే బాగుంటుందని.. క్లాసిక్ లో ఉండే కాజల్ ఏం సెట్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

అంతేకాకుండా అదే టైంకి ఎన్టీఆర్ 30 సినిమాకి సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ రిలీజ్ అవుతూ ఉండడంతో నందమూరి ఫ్యాన్స్ ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాపై కాన్సన్ట్రేషన్ చేస్తున్నారే ..కానీ బాలయ్య బాబు సినిమాపై ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి . ఈ క్రమంలోనే బాలయ్య 108 సినిమాపై సందిగ్ధం వ్యక్తం అవుతుంది. చూడాలి మరి అనిల్ రావిపూడి ఈ ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇస్తాడో..?