తన మరణాన్ని ముందు అంచనా వేసిన కమెడియన్ ధర్మవరం సుబ్రహ్మణ్యం..!!

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్లు ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. నటుడు కమెడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఈయన మరణించి ఇప్పటికీ 10 సంవత్సరాలు పైనే కావస్తోంది. 2013లో లివర్ క్యాన్సర్ తో మరణించిన ఈయన కుమారుడు రవి బ్రహ్మ తేజ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం కుమారుడు మాట్లాడుతూ.. తన తండ్రి తమకు కష్టం తెలియకుండా పెంచారని ఆయన సంపాదించిన ఆస్తి వల్లే మేము ఇప్పటికే చాలా సంతోషంగా ఉన్నామని తెలిపారు.

2001లో నువ్వు నేను సక్సెస్ పార్టీ కి వెళ్ళొస్తున్న సమయంలో ఆయనకు ఒక యాక్సిడెంట్ అయింది బస్సు నాన్న కారు మీద ఎక్కింది తీవ్రంగా గాయాలపాలయ్యారు. అప్పుడు వెంటనే అక్కడున్న కొంతమంది స్థానికులు ఆసుపత్రికి తీసుకువెళ్లడంతో బ్రతికారు..తలపై 21 కుట్లు కుడి చేతికి సర్జరీ వంటివి చేశారని తెలిపారు. 2005లో తన తండ్రి ఉన్నట్లుండి అనారోగ్యానికి లోనయ్యారు సిగరెట్టుకు బానిస కావడంతో ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారట. దీంతో కొన్ని రోజులపాటు కోమాలోనే ఉన్నారని అలా రెండు ప్రమాదాల నుంచి తన తండ్రిని కాపాడుకున్నారని తెలిపారు.

TeluguCinemaHistory on Twitter: "Remembering Comedy Actor 'Dharmavarapu  Subramanyam' Garu on his Birth Anniversary Reply with your favourite  character https://t.co/iFxcaLf65O" / Twitter

కానీ మూడోసారి ఏం చేయలేకపోయాం 2012 దీపావళి తర్వాత ఆయన ఆరోగ్యం మరింత దెబ్బతింది.. లివర్ క్యాన్సర్ నాలుగో స్టేజ్ 11 నెలలకు మించి బ్రతకరని వైద్యులు చెప్పారట.ఇండస్ట్రీలో తన తండ్రి బ్రహ్మానందం గారు గొప్ప స్నేహితులని తరచూ నాన్నకు ఫోన్ చేసి మాట్లాడే వారిని ఒకసారి చూడాలని ఉందిరా ఇంటికి వచ్చి చూస్తాను అంటే నాన్న ఒప్పుకునే వాడు కాదని తెలిపారు.. అంతేకాకుండా నన్ను చూస్తే నువ్వు తట్టుకోలేవు ఆరు నెలలు ఆగు నేనే వస్తా మళ్లీ కలిసి షూటింగ్ చేద్దామని చెప్పారట. కానీ అంతలోనే మరణించారని తెలిపారు రవి బ్రహ్మ.. అయితే తన తండ్రికి తన మరణం దగ్గరలో ఉందని ముందే తెలుసు అని తెలిపారు. తన తండ్రి మరణం తమ కుటుంబంతోపాటు బ్రహ్మానందం గారు కూడా తట్టుకోలేకపోయారని తెలిపారు.