`బిచ్చ‌గాడు` వంటి సూప‌ర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న శ్రీ‌కాంత్‌.. కార‌ణం తెలిస్తే షాకే!

బిచ్చ‌గాడు.. ప్రేక్ష‌కుల‌కు ఎప్ప‌టికీ గుర్తుండి పోయే చిత్రాల్లో ఒక‌టి. విజయ్ ఆంటోనీ హీరోగా శ‌శి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా తమిళంలో మార్చి 4, 2016 న విడుదలై సంచ‌ల‌న విష‌యాన్ని న‌మోదు చేసింది. ఆ త‌ర్వాత ఎలాంటి ప్రమోషన్లు లేకుండానే తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేశాడు. అయితే ఇక్క‌డ కూడా బిచ్చ‌గాడు మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది.

ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చి బాక్సాఫీస్ వ‌ద్ద విధ్వంసం సృష్టించింది. తమిళంలో కంటే తెలుగులోనే ఈ సినిమాకు ఎక్కువ కలెక్షన్లు రావడం గమనార్హం. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ కూడా తెరకెక్కుతోంది. అయితే నిజానికి `బిచ్చగాడు` మూవీతో సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ హీరోగా చేయాల్సింద‌ట‌. కానీ, ఈ ప్రాజెక్ట్ చేతి దాకా వ‌చ్చి మిస్ అయింది. ఈ విష‌యాన్ని శ్రీ‌కాంత్ స్వ‌యంగా వెల్ల‌డించారు.

త‌మిళంలో ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌న త‌ర్వాత బిచ్చగాడును తెలుగులో రీమేక్ చేద్దామనుకున్నారట. దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగాయట. విజయ్ ఆంటోని మహాత్మ చిత్రానికి మ్యూజిక్ అందించారు. ఆ విధంగా శ్రీకాంత్-విజయ్ ఆంటోనికి పరిచయం ఉందట. దీంతో తెలుగులో శ్రీ‌కాంత్ ను హీరోగా పెట్టి రీమేక్ చేయాలని ప్లాన్ చేశారట. కానీ, శ్రీకాంత్ రెమ్యూనరేషన్, బడ్జెట్ లెక్కలు చూస్తే అంచనాలు దాటిపోయాయట. దాంతో రీమేక్ ఆలోచన విరమించుకుని.. డబ్బింగ్ వెర్షన్ విడుదల చేశాడు. డ‌బ్బింగ్ మూవీ అయిన‌ప్ప‌టికీ స‌రికొత్త కంటెంట్‌, త‌ల్లి సెంటిమెంట్‌, కావాల్సిన ఎమోష‌న్స్ ఉండ‌టంతో.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు బిచ్చ‌గాడు మూవీకి బ్ర‌హ్మ‌రంధం ప‌ట్టారు.