బేబీ ష‌వ‌ర్ వేడుక‌లో ఉపాస‌న ధ‌రించి ఆ డ్రెస్సుల ధ‌ర తెలిస్తే మ‌తిపోతుంది!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఆయ‌న స‌తీమ‌ణి ఉపాస‌న త్వ‌ర‌లోనే త‌ల్లిదండ్రులుగా ప్ర‌మోట్ కాబోతున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి అయిన ప‌దేళ్ల‌కు ఉపాస‌న ప్రెగ్నెంట్ అయింది. మ‌రో మూడు నెల‌ల్లోనే ఆమె పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతోంది. ప్రెగ్నెన్సీ కన్ఫమ్ అయినప్పటి నుంచీ రామ్ చరణ్, ఉపాసన తెగ తిరిగేస్తున్నారు.

ఈ మధ్యే వీళ్లు అమెరికాలో చాలా రోజుల పాటు ఉన్నారు. ఆ త‌ర్వాత దుబాయ్‌, మ‌ల్దీవ్స్ అంటూ ఎంజాయ్ చేసి వ‌చ్చారు. మ‌రోవైపు స‌మంత‌కు ప‌లు చోట్ల‌ సీమంతం వేడుక చేస్తున్నారు. అయితే ఈ సంద‌ర్భంగా ఉపాస‌న వేస్తున్న డ్రెస్సుల ధ‌ర తెలిస్తే నెటిజ‌న్ల‌కు మ‌తిపోతోంది. ఇటీవ‌ల‌ దుబాయ్ టూర్ లో ఉపాస‌న‌కు ఆమె క‌జిన్స్ గ్రాండ్ గా బేబీ ష‌వ‌ర్ వేడ‌కను చేశారు. ఈ వేడ‌క‌లో వైట్ డ్రెస్ లో ఉపాస‌న మెరిసింది. ఆస్ట్రేలియన్ బ్రాండ్ కు సంబంధించిన ఈ డ్రెస్ ధర అక్ష‌రాల రూ. 1,55,568.

అలాగే ఏప్రిల్ 19న మెగాస్టార్ చిరంజీవి దంప‌తులు త‌మ ఇంట్లో త‌మ కోడ‌లికి బేబీ ష‌వ‌ర్ నిర్వ‌హించారు. ఆ స‌మ‌యంలో ఉపాస‌న జ‌ప‌నీస్ బ్రాండ్ ఇస్సీ మియాకేకి చెందిన‌ బ్లూ క‌ల‌ర్ ఫ్లీటెడ్ ట్యూనిక్ డ్రెస్ ను వేసుకుంది. ఈ డ్రెస్‌ ధ‌ర రూ. 35,352. ఇక తాజాగా హైదరాబాద్ నగరంలో మరోసారి ఉపాస‌న‌కు బేబీ ష‌వ‌ర్ వేడ‌క‌ నిర్వహించారు. ఈ బేబీ షవర్ కి అల్లు అర్జున్ కూడా వచ్చి సందడి చేశాడు. అయితే ఈ సంద‌ర్భంగా ఉపాస‌న పింక్ ప్యాటర్న్డ్ డ్రెస్ లో అందంగా మెరిసింది. ఈ డ్రెస్ విలువ రూ. 90.471.