ఆ అత్యాశ‌ వ‌ల్లే కృతి శెట్టి కెరీర్ నాశ‌నం అయిందా?

ఉప్పెన సినిమాతో గ్రాండ్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ కృతి శెట్టి.. ఆ వెంటనే శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంది. కెరీర్‌ ఆరంభంలోనే వరుసగా మూడు హిట్స్ పడడంతో కృతి శెట్టిని గోల్డెన్ లెగ్‌ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. యూత్ లో ఈ బ్యూటీకి ఫాలోయింగ్ ఏర్పడింది.

అదే సమయంలో కృతి శెట్టి త‌న రెమ్యున‌రేష‌న్ ను భారీగా పెంచేసింది. ఉప్పెనకు రూ. 50 లక్షలు కంటే లోపే రెమ్యూనరేషన్ తీసుకున్న కృతి శెట్టి.. బంగార్రాజు తర్వాత అత్యాశకు పోయి కోటిన్నర రూపాయలు డిమాండ్ చేసింది. క‌థ‌, తన పాత్ర ప్రాధాన్యత వంటి అంశాలను పట్టించుకోకుండా.. ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చే సినిమాలకు మాత్ర‌మే సైన్ చేసింద‌ట‌.

క‌ట్ చేస్తే గ‌త ఏడాది ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాల రూపంలో వరుస ప్లాపులు పడ్డాయి. దాంతో ఎంత త్వరగా ఎదిగిందో అంతే త్వరగా పాతాళానికి పడిపోయింది. రెమ్యున‌రేష‌న్ విష‌యంలో అత్యాశ‌కు పోయి కెరీర్ ను చేతులారా నాశ‌నం చేసుకుంది. ప్రస్తుతం ఆఫర్లు కూడా అంతంత మాత్రంగా మ‌రాయి. తెలుగులో నాగ‌చైత‌న్య‌కు జోడీగా `క‌స్ట‌డీ` అనే మూవీలో న‌టించింది. ఈ మూవీపైనే కృతి శెట్టి ఆశ‌ల‌న్నీ పెట్టుకుంది.