బాలయ్య ఆ స్టార్ హీరోయిన్ ని అంతలా ప్రేమించాడా.. అయితే వీరి పెళ్లికి అడ్డుపడింది ఎవరు..!?

తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి కుటుంబానికి ఎంతో గౌరవం మరియు ప్రత్యేకత ఉంది. ఈ కుటుంబం నుంచి ఇప్పటికే ఎందరో హీరోలు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈ కుటుంబం నుంచి వచ్చిన మూడోతరం హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ కుటుంబ ఖ్యాతిని ప్రపంచ పటంలో పెట్టాడు. ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డ్ దక్కించుకోవడంలో ఈ నందమూరి హీరో కీలకపాత్ర పోషించాడు. ఈ విషయం ఇలా ఉంచితే ఈ కుటుంబం మొదటి తరం హీరో స్వర్గీయ నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఈయన తన కెరీర్‌లో 300కు పైగా సినిమాలలో నటించి. మరోవైపు రాజకీయాల్లో కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చారు.

ఎన్టీఆర్ తర్వాత తన నట వారసుడుగా తన చిన్న కుమారుడు నందమూరి బాలకృష్ణను తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం చేశాడు. ఈ కుటుంబం నుంచి వచ్చిన రెండో తరం హీరోగా బాలకృష్ణ తెలుగులోనే నెంబర్ వన్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటికీ తన సినిమాలతో నేటితరం హీరోలకు పోటీ ఇస్తూ చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్నాడు. అయితే బాలకృష్ణ సినిమాల విషయం కాస్త పక్కన పెడితే.. బాలయ్య తన కెరీర్ బిగినింగ్ లో ఓ స్టార్ హీరోయిన్ ని ఎంతో గాఢంగా ప్రేమించారట. అంతేకాకుండా ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కూడా కన్నారట.

కానీ అయ‌న కలలన్నీ అడియాసులు చేస్తూ బాలయ్యకు అదిరిపోయే షాక్ ఇచ్చారు. ఎందుకంటే బాలయ్య ప్రేమించిన హీరోయిన్ ఆ రోజుల్లో గ్లామర్ పాత్రలో నటిస్తూ కుటుంబ సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఉండేది. అయితే తమ ఇంటికి కోడలుగా వచ్చే అమ్మాయి అచ్చ తెలుగు అమ్మాయిల సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చి ఉండాలని.. అలా పద్ధతిపాడు లేకుండా గ్లామర్ పాత్రలో నటిస్తూ ఉండటం ఎన్టీఆర్ గారికి నచ్చలేదట. ఈ విధంగా ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలన్న బాలకృష్ణ కోరికకు అడ్డుపడ్డారు.

Balakrishna wife Vasundhara signature forged

అంతేకాకుండా ఇదే విషయంలో బాలయ్య అన్న హరికృష్ణ సైతం ఆయనకు అడ్డు చెప్పారట. ఇదే సమయంలో ఎన్టీఆర్ గారు కేవలం నెల రోజుల వ్యవధిలోనే బాలకృష్ణకు వసుంధర అనే అమ్మాయిని ఇచ్చిపెళ్లి చేశాడు. బాలయ్య పెళ్లి చేసుకున్న వసుంధర సంప్రదాయ కుటుంబంలో పుట్టిన అమ్మాయి. అలా ఆ సమయంలో ఎన్టీఆర్ గారు బాలకృష్ణ ప్రేమకి అడ్డుకట్ట వేశారు. అయితే అప్పట్లో బాలయ్య ప్రేమించిన హీరోయిన్ కుష్బూ అని కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అయితే అందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ వీరి పేర్లు బాగా వినిపించాయి.