టీడీపీకి ఆ సీట్లు గెలవడం కలేనా!

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టి‌డి‌పి పోటాపోటిగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ జిల్లాలో రెండు పార్టీలకు సమాన బలం ఉంది..గత ఎన్నికల్లో కూడా వైసీపీ వేవ్ ఉన్నా సరే టి‌డి‌పి ఇక్కడ 4 సీట్లు గెలుచుకుంది. వైసీపీకి 8 సీట్లు దక్కాయి. అయితే ఇప్పుడు నిదానంగా టి‌డి‌పి బలం ఇంకా పెరుగుతూ వస్తుంది. టి‌డి‌పి కి 6 సీట్లలో గెలుచుకునే సత్తా పెరిగింది. అటు వైసీపీ బలం 5 సీట్లకు పడింది. ఒక సీటులో పోటాపోటి ఉంది.

ఇటీవల ఓ సర్వే ప్రకారం టి‌డి‌పి గెలవడానికి అవకాశాలు ఉన్న సీట్లు..అద్దంకి, కొండపి, కనిగిరి, పర్చూరు, సంతనూతలపాడు, ఒంగోలు. అటు వైసీపీ గెలుపుకు అవకాశం ఉన్న సీట్లు మార్కాపురం, గిద్దలూరు, కందుకూరు, దర్శి, యర్రగొండపాలెం ఉన్నాయి. ఇక చీరాలలో పోటాపోటి ఉంది. గత ఎన్నికల్లో చీరాలలో టి‌డి‌పి గెలిచింది. కానీ అక్కడ గెలిచిన కరణం బలరామ్ తర్వాత వైసీపీలోకి వెళ్లారు. దీంతో చీరాలలో టి‌డి‌పికి కాస్త ఇబ్బంది అయింది. కానీ నిదానంగా అక్కడ పుంజుకుంటుంది.

అయితే ఇక్కడ టి‌డి‌పి కొన్ని సీట్లని గెలుచుకోవడం కష్టమే అనే పరిస్తితి. అసలు మళ్ళీ ఆ సీట్లలో గెలవడం జరిగే పనిలా కనిపించడం లేదు. అలా టి‌డి‌పికి నాలుగు సీట్లలో గెలుపు దూరమయ్యేలా ఉంది. జనసేనతో పొత్తు ఉంటే చీరాల, దర్శి సీట్లని సైతం గెలుచుకునే ఛాన్స్ ఉంది. కానీ మార్కాపురం, కందుకూరు, యర్రగొండపాలెం సీట్లలో గెలుపు సాధ్యం కాదనే చెప్పవచ్చు.

అసలు కందుకూరులో కమ్మ ఓటు బ్యాంకు ఎక్కువ ఉన్నా సరే టి‌డి‌పి గెలవలేని పరిస్తితి అక్కడ నేతల మధ్య గ్రూపు తగాదాలు వల్ల 2004 నుంచి పార్టీ గెలవడం లేదు. ఇప్పటికీ టి‌డి‌పి గెలవలేని స్థితిలో ఉంది. ఇక పొత్తు వల్ల కొద్దో గొప్పో గిద్దలూరులో ప్రభావం చూపవచ్చు. మొత్తానికి మార్కాపురం, కందుకూరు, యర్రగొండపాలెం సీట్లలో టి‌డి‌పికి గెలుపు కలే.

 

Share post:

Latest