పాపం.. ఆ హీరోయిన్‌ని ప్రేమించి మోసపోయిన అల్లరి నరేష్..నిజమేనా..!?

సీనియర్ స్టార్ దర్శకుడు ఇవివి సత్యనారాయణ నట వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన అల్లరి నరేష్.. కామెడీ సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన అల్లరి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. మొదటి సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న అల్లరి నరేష్ ..వరుస సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లో బిజీగా ఉన్నాడు.. గత కొంతకాలంగా అల్లరి నరేష్ తన కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Allari Naresh Coming With A Political Movie

అయ‌న‌ నటించిన సుడిగాడు సినిమా తర్వాత ఆయనకు సరైన హిట్‌ పడలేదు. అప్పటినుంచి ఆయన తన కెరీర్ లో ఎన్నో ఇబ్బందులకు గురయ్యాడు. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ఆయనకు సక్సెస్ ఇవ్వలేకపోయాయి. 2021లో వ‌చ్చిన‌ నాంది సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టాడు. ఈ సినిమాలో తన నటనతో అందరిని మెప్పించి సూపర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు.

Naandhi movie review: Allari Naresh's strong performance keeps this drama  afloat | Entertainment News,The Indian Express

ఇదిలా ఉండగా అల్ల‌రి నరేష్ గురించి గతంలో ఒక వార్త బాగా వైరల్ అయింది. ఆ వార్త ఏమిటంటే అల్లరి నరేష్ తనకంటే పెద్దదైన పెళ్లయిన హీరోయిన్ ని ప్రేమించాడని.. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడని వార్తలు బయటకు వచ్చాయి.. ఆ హీరోయిన్ మరి ఎవరో కాదు అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సీమశాస్త్రి, బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్స్ ఈ సినిమాలలో హీరోయిన్‌గా నటించిన ఫర్జానా.

Allari Naresh : పెండ్లైన హీరోయిన్ తో అల్ల‌రి న‌రేశ్ ల‌వ్వాయ‌ణం..  చివ‌ర‌కు..! - Latest News Telugu

ఈ సినిమాల షూటింగ్‌ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందట.. వీరిద్దరూ జతగా పలు ప్రదేశాలకు కూడా వెళ్లారు..ఫర్జానా రెండు మూడు సార్లు అల్లరి నరేష్ తో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది. ఈ వార్త అప్పట్లో బాగా వైరల్ అయింది. అప్ప‌టినుంచి వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అంటూ వార్తలు షికారు చేశాయి. అప్పుడు అల్లరి నరేష్ ఇవేవీ నిజం కాదని మేమిద్దరం స్నేహితులం మాత్రమే అని ఆవిడ పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయిందని చెప్పడంతో అప్పటినుంచి ఈ వార్తలు ఆగిపోయాయి.

Share post:

Latest